‘బిగ్‌బాస్‌లో ఆ కంటెస్టెంట్ వ్యాంప్‌లా.. అంగాంగ, అశ్లీల ప్రదర్శన.. ఆమె గెలువదు’

బిగ్‌బాస్ రియాలిటీ షో మొదలై కొన్ని వారాలు కాకముందే సెలబ్రిటీల జాతకాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. అత్యంత ప్రజాదరణ ఉన్న ఈ షోలో ఎవరు విజేతలుగా నిలుస్తారనే విషయంపై అనేక మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ 14వ సీజన్‌లో ఎవరు గెలుస్తారనే విషయంపై బిగ్‌బాస్ 3 విజేత విందు దారాసింగ్ తన అభిప్రాయాన్ని ఏమని వ్యక్తం చేశారంటే...

ఆ ముగ్గురిని తీసుకురావడంపై

ఆ ముగ్గురిని తీసుకురావడంపై


గత సీజన్‌లో కంటెస్టెంట్లుగా నిలిచిన సిద్ధార్థ్ శుక్లా, హీనా ఖాన్, గౌహర్ ఖాన్‌‌ను సీనియర్లుగా షోలోకి తీసుకురావడం సరైన నిర్ణయమే అని విందూ దారాసింగ్ అన్నారు. వారి రాక వల్ల మొదటి రోజు నుంచే షోకు పాపులారిటీ వచ్చిందని అన్నారు. నిర్వాహకులు నిర్ణయం తాజా బిగ్‌బాస్ 14కు కలిసి వచ్చిందన్నారు. ఈ సీజన్‌లో గాయపడిన సారా గుర్పాల్‌ను సీనియర్లు ఎలిమినేట్ చేయడం సరైందేనని అన్నారు.

నిక్కి తంబోలి గెలువదు

నిక్కి తంబోలి గెలువదు


బిగ్‌బాస్ 14‌లో ఎవరు విజేతగా నిలుస్తారనే ప్రశ్నకు విందూ దారా సింగ్ జవాబిస్తూ... ఇజాజ్ ఖాన్, రుబీనా దిలైక్, పవిత్ర పునియా, నిక్కి తంబోలి చివరి వరకు ఉంటారు. కానీ ఇప్పుడు బిగ్‌బాస్‌లో హల్‌చల్ చేస్తున్న నిక్కి తంబోలి మాత్రం విజేతగా నిలవదు అంటూ విందూ దారాసింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

మితిమీరిన నిక్కి అశ్లీల లీలలు

మితిమీరిన నిక్కి అశ్లీల లీలలు

ఇక ఇంటిలో గ్లామర్‌ పంట పండిస్తున్న నిక్కి తంబోలిపై విందూ దారాసింగ్ అనూహ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఇంటిలో ఆమె అంగాంగ ప్రదర్శన చేస్తున్నది. నిక్కి వ్యాంప్‌‌గా బిహేవ్ చేస్తున్నది. ఆమె అశ్లీల లీలలు మితిమీరిపోతున్నాయి అంటూ విందూ కామెంట్ చేశారు.

Recommended Video

Bigg Boss Telugu 4: Monal Ghajjar Extra Glamour
నిక్కి తంబోలి అనవసరంగా గొడవలకు

నిక్కి తంబోలి అనవసరంగా గొడవలకు


నిక్కి తంబోలిపై విందూ దారాసింగ్ మరిన్ని కామెంట్లూ చేస్తూ.. ఇంటిలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారింది. అయితే అనవసరంగా వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నది. ఇంటి సభ్యులతో అనవసరంగా గొడవకు దిగుతున్నది. ఇలాంటి విషయాలు ఆమెకు ప్రతికూలంగా మారే అవకాశం ఉందనే మాటను విందూ పేర్కొన్నారు.

రానున్న వారాల్లో మరింత క్రేజీగా

రానున్న వారాల్లో మరింత క్రేజీగా

బిగ్‌బాస్ 14 కోసం ఎంపిక చేసిన కంటెస్టెంట్లు అద్భుతంగా ఉన్నారు. రానున్న వారాల్లో వారు షోను మరో లెవెల్‌కు తీసుకెళ్తారు. షో ప్రారంభమై రెండు, మూడు వారాలే కాబట్టి రానున్న రోజుల్లో బిగ్‌బాస్ 14 మరింత జనరంజకంగా మారుతుంది. ఇంటిలో జాస్మిన్ భాసిన్ రచ్చ చేయడం ఖాయం. అభినవ్ శుక్లా అందరి దృష్టిని తిప్పుకొనే సత్తా ఆయనకు ఉంది అని విందూ దారాసింగ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X