మూడు నెలల పాటు హీరోయిన్‌ని అలా.. మీటూ కేసులో దర్శకుడికి క్లీన్ చిట్!

గత ఏడాది మీటూ ఉద్యమంతో బాలీవుడ్ మోతెక్కిపోయిన సంగతి తెలిసిందే. నటులు, దర్శకులు, నిర్మాతలు ఇలా వరుసగా బడా సెలెబ్రిటీల పేర్లు లైంగిక వేధింపుల నేపథ్యంలో బయటకు వచ్చాయి. నానా పాటేకర్, వికాస్ బహల్, షాజిద్ ఖాన్ లాంటి ప్రముఖులు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన సంగతి తెలిసిందే. మీటూ ఉద్యమ నేపథ్యంలో హౌస్ ఫుల్ 4, సూపర్ 30 లాంటి చిత్రాలే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. నమస్తే లండన్, నమస్తే ఇంగ్లాండ్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు విపుల్ షాపై కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి.

మోడల్‌గా రాణిస్తూ

మోడల్‌గా రాణిస్తూ

ఇరాన్ కు చెందిన ప్రముఖ మోడల్ ఎల్నాజ్ నోరూజి బాలీవుడ్ లో పాగా వేయాలని ప్రయతిస్తున్న సంగతి తెలిసిందే. ఎల్నాజ్ కొన్ని వెబ్ సిరీస్ లు,హిందీ చిత్రాలలో కూడా నటించనుంది. కానీ పూర్తి స్థాయిలో గుర్తింపు పొందలేదు. హీరోయిన్ గా రాణించాలని గట్టి ప్రయత్నం చేసింది. కానీ ఈ ఎల్నాజ్ కెరీర్ జోరుపెంచే పాత్రలు ఇంకా దక్కలేదు.

దర్శకుడికి క్లీన్ చిట్

దర్శకుడికి క్లీన్ చిట్

గత ఏడాది ఎల్నాజ్ ప్రముఖ దర్శకుడు విపుల్ షాపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. దీనితో దర్శకుడిపై ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు కూడా నమోదైంది. దీనితో విపుల్ షాతో పాటు, ఎల్నాజ్ ని కూడా విచారణకు పిలిచారు. కానీ ఎల్నాజ్ విచారణకు హాజరయ్యేందు ఇష్టపడలేదు. ఆమె విచారణకు హాజరైతే జరిగిన వాస్తవాలు ఏంటో వివరించేందుకు తాను సిద్ధం అని విపుల్ షా తెలిపాడు. ఎల్నజ్ తనపై అసత్య ఆరోపణలు చేయడం వలనే విచారణకు హాజరుకాలేకుందని విపుల్ షా బలంగా తన వాదన వినిపించాడు. దీని ఇండియన్ ఫిలిం అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ అసోసియేషన్ అతడికి క్లీన్ చిట్ ప్రకటించింది.

మూడు నెలల పాటు

మూడు నెలల పాటు

గత ఏడాది ఎల్నాజ్ విపుల్ షా పై తీవ్రమైన ఆరోపణలు చేసింది. ఓ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా అవకాశం ఇస్తానని చెప్పి మూడు నెలల తనని లైంగికంగా వాడుకునట్లు ఎల్నాజ్ ఆరోపించింది. మీటూ ఉద్యమం జోరుగా సాగుతున్న సమయంలో ఈ హాట్ మోడల్ వ్యాఖ్యలు సంచలనం రేపాయి. పలు సందర్భాల్లో తనని బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడని, తన శరీరంపై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడని ఎల్నాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే.

మీటూ ఉద్యమం

మీటూ ఉద్యమం

తాజాగా విపుల్ షాకు క్లీన్ చిట్ లభించడంతో ఎల్నాజ్ స్పందన ఏంటో తెలియాల్సి ఉంది. తనుశ్రీ దత్త గత ఏడాది నానా పాటేకర్ పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. తనుశ్రీ తర్వాత పలువురు హీరోయిన్లు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులని ధైర్యంగా ప్రస్తావించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X