రణబీర్ కపూర్-అలియా భట్ ఫోటోస్ వైరల్... పెళ్లి గురించిన చర్చలేనా?
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నేటితో 36వ వసంతంలోకి అడుగు పెడుతున్నారు. ఈ సందర్భంగా నిన్న రాత్రి హీరోయిన్ అలియా భట్ తన తల్లి సోనితో కలిసి రణబీర్ ఇంటికి రావడం చర్చనీయాంశం అయింది. రణబీర్ కపూర్, అతడి తల్లి నీతూతో కలిసి.... అలియా భట్, ఆమె తల్లి సోని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఫోటో చూస్తుంటే రణబీర్‌ను విష్ చేయడానికి తల్లీ కూతుర్లు వచ్చినట్లు కనిపించినా.... విషయం వేరే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
రణబీర్ కపూర్, అలియా భట్ కొన్ని రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లికి ఇరు కుటుంబాలు అంగీకారం తెలిపినట్లు సైతం వార్తలు వచ్చాయి. తాజాగా అలియా భట్ తల్లి సోని... రణబీర్ కపూర్ తల్లి నీతూను కలవడంతో కొత్త సందేహాలు తెరపైకి వచ్చాయి.

ఈ మీటింగులో వీరు రణబీర్ - అలియా పెళ్లి గురించి మాట్లాడారని.... ఏ సమయంలో పెళ్లి చేస్తే బావుంటుంది? ఎక్కడ చేస్తే బావుంటుంది అనే అంశాలపై చర్చించుకున్నట్లు టాక్. త్వరలోనే తమ పిల్లల పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించే అవకాశం ఉంది.
అలియా భట్‌ను తమ ఇంటి కోడలిని చేసుకోవడంపై రిషీ కపూర్-నీతూ కపూర్ కూడా సంతోషంగా ఉన్నారట. తమ కుమారుడికి తగిన జోడీ, తెలివైన అమ్మాయి భార్యగా రావడంపై వారు పూర్తిగా సంతృప్తిగా ఉన్నట్లు గతంలో వారి మాటల్లో స్పష్టమైన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











