కోహ్లిని ముద్దులతో ఓదార్చిన అనుష్క.. వైరల్ అవుతున్న వీడియో!
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లిని పెళ్లాడిన తర్వాత మరింత హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. వీరి అన్యోన్య దాంపత్యం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Recommended Video
సదరు వీడియోలో అనుష్క... తన భర్త కోహ్లి చేతిని ముద్దాడుతూ అతడిని ఓదార్చే ప్రయత్నం చేసినట్లు స్పష్టమవుతోంది. మరి కోహ్లిని అనుష్క అలా ఓదార్చడానికి కారణం ఏమిటి? ఈ టీమిండియా కెప్టెన్ భావోద్వేగానికి కారణం ఏమిటి అనే విషయమై ఓ లుక్కేద్దాం.

ఫిరోజ్ షా కోట్లా మైదానంలో...
ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానానికి ఇటీవల మరణించిన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ అరుణ్ జైట్లీ పేరు పెట్టారు. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ స్టేడియంలోని ఓ స్పెషల్ స్టాండ్‌ను విరాట్ కోహ్లికి అంకింతం చేశారు. ఈ సందర్భంగా డిడిసీఏ అధ్యక్షుడు రజత్ మాట్లాడుతుండగా కోహ్లి భావోద్వేగానికి గురయ్యారు.
ఆ మాట అనగానే కోహ్లి ఎమోషనల్
‘‘తన తండ్రి చనిపోయినపుడు కూడా కోహ్లి దేశం కోసం ఆడటానికి వెళ్లారు, క్రికెట్ ప్రపంచంలో కోహ్లి కంటే గొప్పఆటగాడు లేరని అరుణ్ జైట్ల ప్రశంసించేవారు'' అని రజత్ శర్మ గుర్తు చేయగానే విరాట్ కోహ్లి భావోద్వేగానికి గురయ్యారు. దీంతో వెంటనే అనుష్క అతడి చేయి ముద్దాడుతూ ఓదార్చే ప్రయత్నం చేసింది.

వైరల్ అవుతున్న వీడియో
అనుష్క కోహ్లిని ముద్దాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి పేజీల్లో అభిమానులు ఈ వీడియోను షేర్ చేయడంతో వెంటనే వైరల్ అయింది. కోహ్లిపై పలువురు ప్రశంసలు గుప్పిస్తుండగా, అనుష్క-కోహ్లిది ది బెస్ట్ జోడీ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

అనుష్క, విరాట్ కోహ్లి
అనుష్క శర్మ, విరాట్ కోహ్లి వివాహం 2017లో సీక్రెట్‌గా జరిగింది. అతి కొద్ది మంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఇటలీలోని టుస్కానీలో వీరి వివాహం జరిగింది. పెళ్లికి ముందు కొంతకాలం పాటు వీరు డేటింగ్ చేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











