భుటాన్‌లో అనుష్క సరదాలు.. నెట్టింట వైరల్ పిక్స్.. వెల్లువెత్తుతున్న కామెంట్స్
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లలో బాలీవుడ్ భామ అనుష్క శర్మ ఒకరు. భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని పెళ్లాడిన ఈమె.. ఆయనతో సరదా జీవితం గడుపుతోంది. ఇటీవలే కోహ్లీ 31వ బర్త్ డే సందర్భంగా ఆయనతో కలిసి భుటాన్‌కు వెళ్ళింది అనుష్క శర్మ. దాదాపు వారం రోజులుగా విరుష్క జోడి భుటాన్‌లోని అందమైన ప్రదేశాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఎప్పటికప్పుడు ఈ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తోంది అనుష్క.
ఈ భుటాన్ పర్యటనకు సంబందించిన మరికొన్ని ఫొటోలను ఆదివారం అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోల్లో కోహ్లీ, అనుష్క ఇద్దరూ వీధి కుక్క పిల్లతో సరదాగా ఆడుకుంటూ కనిపిస్తున్నారు.
అంతేకాదు లేగ దూడలతో కోహ్లీ ఆడుకుంటుంటే.. అనుష్క అలా చూస్తూ ఎంజాయ్ చేసింది. ఈ ఫోటోలను పోస్ట్ చేసిన కొద్దిక్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అభిమానులు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

భుటాన్ పర్యటనకు ముందు వోగ్ మ్యాగజైన్‌కు అనుష్క శర్మ ఫొటో షూట్ ఇచ్చింది. షూట్ అనంతరం నిర్వహించిన ఇంటర్వ్యూలో అనుష్క మీడియాతో మాట్లాడారు. 'విరాట్ వార్డ్ రోబ్‌లో చాలా దుస్తులు ఉంటాయి. నాకు నచ్చిన వాటిని వేసుకుంటా. ఎక్కువగా టీషర్ట్స్ వేసుకోవడానికి ఇష్టపడతా. కొన్నిసార్లు కోహ్లీ జాకెట్స్ కూడా వేసుకుంటా. నేను కోహ్లీ దుస్తులు వేసుకుంటే అతను చాలా సంతోషిస్తాడు. నాక్కూడా ఇష్టమే' అని తెలిపింది.


Click it and Unblock the Notifications











