కోహ్లీ ముందు తన బలాన్ని చూపించిన అనుష్క.. ఏకంగా భర్తనే ఎత్తిపడేసింది!
ఇండియన్ బెస్ట్ స్టార్ కపుల్స్ లలో విరుష్క టాప్ లిస్ట్ లో ఉంటారని చెప్పవచ్చు. ప్రొఫెషన్స్ వేరైనా కూడా ఎల్లప్పుడూ ఆనందంగా కనిపించే ఈ జంట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుంది. ఇక సోషల్ మీడియా వీరి ఫాలోవర్స్ సంఖ్యను చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇక వారి ఫొటోలు వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఇటీవల విరాట్ కోహ్లీకి అనుష్క తన బలాన్ని చూపించిన వీడియోను షేర్ చేసుకుంది.

మరింత దగ్గరయ్యాడు
ఒకరేమో టీమిండియా క్రికెట్ కెప్టెన్, మరొకరేమో బాలీవుడ్ స్టార్ హీరోయిన్. యాడ్స్ ద్వారా కలుసుకున్న ఈ స్టార్స్ మధ్య ప్రేమ ఎప్పుడు మొదలయ్యిందో గాని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. ఇద్దరు వారి ప్రొఫెషినల్ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఖాళీ సమయాల్లో వీలైనంత వరకు టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తారు.
మరొక వీడియో వైరల్
విరాట్ కోహ్లీ విదేశాలకు వెళితే అతని వెంటే అనుష్క వెళ్లడం గురించి అందరికి తెలిసిందే. ఇక వీరి కలయికలో చోటు చేసుకునే ఎన్నో సరదా సన్నివేశాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఇటీవల అనుష్క, విరాట్ లకు సంబంధించిన మరొక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కింద పడేసినంత పని చేసింది..
ముందుగా కోహ్లీ తన భార్యను ఆటపట్టించాడు. నన్ను నిజంగా ఎత్తుకున్నవా మరోసారి ఎత్తి చూపించు.. అంటూ సవాల్ విసరగానే అనుష్క తన బలాన్ని చూపించింది. విరాట్ ను వెనకాల నుంచి పైకి లేపి కింద పడేసినంత పని చేసింది. ఫిట్నెస్ మాస్టర్ విరాట్ తో పోటీ పడిన అనుష్కకు అభిమానులు పాజిటివ్ గా మద్దతు పలుకుతున్నారు.
Recommended Video

100మిలియన్ల ఫాలోవర్స్
ఇక ఇటీవల అనుష్క ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఆ పాపకు వమికా కోహ్లీ అని పేరు పెట్టారు. ఇక విరాట్ కోహ్లీ తన ఫాలోవర్స్ సంఖ్యను రోజురోజుకు మరింత పెంచుకుంటున్నాడు. ఇన్స్టాగ్రామ్ లో ప్రస్తుతం అత్యదిక ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ సెలబ్రెటీలలో విరాట్ కోహ్లీ 100మిలియన్ల ఫాలోవర్స్ తో మొదటి స్థానంలో ఉన్నాడు.


Click it and Unblock the Notifications











