సముద్రం మధ్యలో విరాట్ కోహ్లీతో అనుష్క రొమాంటిక్ లుక్.. ఫోటో తీసిన వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మెన్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక వైపు క్రికెట్ తోనే కాకుండా తన భాగస్వామితో కూడా జీవితాన్ని చాలా అందంగా గడుపుతాడాని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. భార్య అనుష్క శర్మకు అతను పెద్దగా దూరంగా ఉండడానికి అస్సలు ఇష్టపడడు. ఏ మాత్రం గ్యాప్ వచ్చినా అనుష్కతో హాలిడేస్ ని ఎంజాయ్ చెసే విరాట్ ఇప్పుడు అనుష్క శర్మ కూడా దుబాయ్ లోకి రావడంతో ప్రతి రోజు ఆమెకు ఇంకాస్త దగ్గరగా ఉంటున్నాడు.

సముద్ర తీరంలో కోహ్లీతో అనుష్క
హీరోయిన్ అనుష్క శర్మ ప్రస్తుతం ప్రెగ్నెన్సీతో ఉండడంతో పూర్తిగా సినిమాలను దూరంగా పెట్టేసింది. ఇక ఇలాంటి సమయంలో భర్తకు దూరంగా ఉండడానికి ఇష్టపడని ఆమె ఐపీఎల్ తో బిజీగా ఉన్న విరాట్ తో తన ప్రేమ యాత్రలను కూడా అదే పనిగా కొనసాగిస్తోంది. ఇక రీసెంట్ గా అనుష్క తో సముద్ర తీరంలో గడిపిన ఆనంద క్షణాలని విరాట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

ఫొటో తీసిన డివిలియర్స్
సూర్యడు ఎర్రబడిన సాయంత్రానికి అనుష్క, విరాట్ కోహ్లీ ఒక అందమైన సముద్ర తీరంలో సరదాగా గాడిపారు. విరాట్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) జట్టు సభ్యుడు ఎబి డివిలియర్స్ ఈ ఫోటోను తీశాడు.ఇక ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన విరాట్ హృదయం, సూర్యాస్తమయం ఎమోజీలతో కోహ్లీ క్యాప్షన్ చేశారు. ఇక అభిమానులు ఈ చిత్రంపై అపారమైన ప్రేమను చూపించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

వైరల్ అవుతున్న మరో ఫోటో
ఇక గత రాత్రి నుంచి అనుష్క శర్మకి సంబంధించిన మరో ఫోటో వైరల్ అవుతోంది. యుజెవేంద్ర చాహల్ యొక్క కాబోయే సతీమణి ధనశ్రీ వర్మ రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సిబి గెలిచిన తరువాత అనుష్కతో అందమైన సెల్ఫీని తీసుకుంది. "హ్యాపీ పీపుల్. నా మొదటి మ్యాచ్ నుండి కొన్ని సంతోషకరమైన క్షణాలను పంచుకుంటున్నాను. జట్టుకు అభినందనలు" అని ధనశ్రీ వివరణ ఇచ్చింది.
Recommended Video

మొదటి బిడ్డ జనవరిలో..
ఇక లాక్ డౌన్ నుంచి సినిమా షూటింగ్స్ దూరంగా ఉంటున్న అనుష్క శర్మ కొన్ని నెలల క్రితం త్వరలోనే మా సంఖ్య పెరగబోతోంది అంటూ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. మొదటి బిడ్డను 2021 జనవరిలో ఆశిస్తున్నట్లు చెప్పి అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన ఈ జంట బెస్ట్ విషెస్ అందుకున్నారు. ఇక ఇండియాలో ఒంటరిగా ఉండలేక భర్త కోసం ఆమె ఇటీవల దుబాయ్ కి వచ్చేశారు..


Click it and Unblock the Notifications











