పండంటి బిడ్డకు జన్మినిచ్చిన అనుష్క శర్మ.. విరాట్ కోహ్లీ ఎమోషనల్ మెస్సేజ్

ఇండియన్ బెస్ట్ సెలబ్రేటి జంటలలో ఒకరైన విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. గత కొంతకాలంగా వీరికి సంబంధించిన వార్తలు ఏ రేంజ్ లో వైరల్ అవుతున్నాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఫైనల్ గా విరాట్ కోహ్లీ మా ఫ్యామిలీలోకి మరొక పర్సన్ వచ్చాడు అంటూ ఎమోషనల్ గా మంచి మెస్సేజ్ ఇచ్చాడు.

వారసురాలు వచ్చింది

వారసురాలు వచ్చింది

ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ 2017లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం ఒకరినొకరు అర్థం చేసుకొని పెళ్లి చేసుకున్న ఈ జంట మొత్తానికి వారి ఇంటికి వారసురాలిని తీసుకువచ్చారు. ఇక ప్రస్తుతం అందుకు సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది.

విరాట్ ఎమోషనల్ మెస్సేజ్..

విరాట్ ఎమోషనల్ మెస్సేజ్..

ఈ రోజు మధ్యాహ్నం మేము ఒక బేబి గర్ల్ కు జన్మనిచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాము. ఈ శుభవార్తను మీతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమ అభిమానానికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా సరిపోవు. అనుష్క అలాగే పాప ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇక నుంచి మా జీవితాల్లో ఒక కొత్త చాప్టర్ మొదలు కాబోతోంది. ఈ క్లిష్ట సమయంలో మా ప్రైవసీని మీరు గౌరవిస్తారని అనుకుంటున్నట్లు.. విరాట్ వివరణ ఇచ్చాడు.

మొదట సీక్రెట్ గా ఉంచినప్పటికి..

మొదట సీక్రెట్ గా ఉంచినప్పటికి..

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఆగస్ట్ లో ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకున్న విషయం తెలిసిందే. మొదట పర్సనల్ విషయంగా సీక్రెట్ గా ఉంచినప్పటికి ఆ తరువాత జనవరిలో మరొక గుడ్ న్యూస్ చెబుతామని అన్నారు. అలాగే మా కుటుంబం పెద్దది కాబోతోందని మరొకరి కోసం ఎదురుచూస్తున్నట్లు విరాట్ ఎన్నోసార్లు సోషల్ మీడియాలో తెలిపాడు.

విరాట్ కూతురికి కూడా..

విరాట్ కూతురికి కూడా..

ఇక ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్ లలో ధోని, రోహిత్ శర్మ, హర్భజన్, సురేష్ రైనా కుతుళ్లకు సోషల్ మీడియాలో భారీ క్రేజ్ అందుతున్న విషయం తెలిసిందే. ఇక విరాట్ కోహ్లీ కూతురికి కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం పక్కా అని చెప్పవచ్చు. ఇక విరాట్ కోహ్లీకి అభిమానులతో పాటు స్టార్ క్రికెటర్లు కూడా కూతురు పుట్టిన సందర్భంగా విషెస్ అందిస్తున్నారు.

Recommended Video

Anushka Sharma Serious Recation on Her Pregnancy Rumors

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X