విరాట్ కోహ్లితో అనుష్క శర్మ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ (ఫోటోస్)

Recommended Video

Happy New Year 2019: Virat Kohli & Anushka Celebrates New Year In Australia

బాలీవుడ్ నటి అనుష్క శర్మ, క్రికెటర్ విరాట్ కోహ్లి దంపతులు న్యూఇయర్ 2019 సెలబ్రేషన్స్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో జరుపుకున్నారు. ఇద్దరూ ఎవరి ప్రొఫెషన్లో వారు బిజీగా ఉంటూనే స్పెషల్ మూమెంట్స్ మిస్సవ్వకుండా వాటిని ఎంజాయ్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

ఇండియా-ఆస్ట్రేలియా సిరీస్‌లో భాగంగా కోహ్లి ఆస్ట్రేలియాలో ఉండటంతో.... అనుష్క కూడా అక్కడ వాలిపోయారు. ఎంతో రొమాంటిక్‍‌గా నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. ఈ జంట తమ మొదటి పెళ్లి రోజు కూడా ఇటీవల ఆస్ట్రేలియాలో జరుపుకున్న సంగతి తెలిసిందే.

ఫోటోస్ షేర్ చేసిన కోహ్లి

ఫోటోస్ షేర్ చేసిన కోహ్లి

సిడ్నీలో తమ న్యూఇయర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను విరాట్ కోహ్లి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. సిడ్నీ వీధుల్లో తిరుగుతూ ఈ సెలబ్రిటీ కపుల్ న్యూఇయర్ వేడుక జరుపుకున్నట్లు తెలుస్తోంది.

పిక్ అదిరిపోయింది

పిక్ అదిరిపోయింది

ఈ సందర్భంగా తన ముద్దుల భార్య అనుష్కతో దిగిన ఓ రొమాంటిక్ ఫోటోను షేర్ చేసిన కోహ్లీ అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ ఏడాది అందరికీ మంచి జరుగాలని ఆకాంక్షించారు.

అనుష్క సందేశం

అనుష్క సందేశం

ఈ నూతన సంవత్సరంలో అందరూ నమ్మకం, శాంతి, కంపాషన్‌తో నిద్రలేచారని భావిస్తున్నాను. ప్రతి ఒక్కరూ తాము అనుకున్న లక్ష్యాలు చేరుకుని జీవితంలో మరింత వెలిగిపోవాలని ఆశిస్తున్నాను అంటూ అనుష్క అభిమానులకు సందేశం పంపారు.

2018 సంవత్సరం అనుష్కకు చేదు, తీపి జ్ఞాపకాలు

2018 సంవత్సరం అనుష్కకు చేదు, తీపి జ్ఞాపకాలు

2018 సంవత్సరంలో అనుష్కకు కెరీర్ పరంగా పలు తీపి, చేదు జ్ఞాపకాలు మిగిలాయి. గతడేది ఆమె సంజు, సూయిదాగా, జీరో చిత్రాల్లో నటించారు. ఇందులో సంజు హిట్టవ్వగా, సూయిదాగా ఫర్వాలేదనిపించింది. జీరో చిత్రం ప్లాపైన సంగతి తెలిసిందే. 2019లో ఇంకా ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X