అనుష్క-విరాట్ మొదటి కార్వా చౌత్ సెలబ్రేషన్స్
బాలీవుడ్ నటి అనుష్క శర్మ తొలి కార్వా చౌత్ పండుగను భర్త విరాట్ కోహ్లితో కలిసి ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా ఇద్దరూ ఈ వేడుక ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. విరాట్-అనుష్క వివాహం తర్వాత వచ్చిన తొలి కార్వా చౌత్ ఇది.

ఉత్తరాదిలో కర్వాచౌత్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. భర్తలు దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండేందుకు భార్యలు చంద్రుడిని పూజించే పండుగే కర్వాచౌత్. అనుష్క-విరాట్‌తో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు ఈ వేడుకను జరుపుకున్నారు.
భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం దీక్షను విరమిస్తారు. అనుష్క కూడా ఇలాగే ఉపవాసం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో కోహ్లితో దిగిన ఫోటో షేర్ చేస్తూ 'మై మూన్, మై సన్, మై స్టార్, మై ఎవ్రీథింగ్' అని పేర్కొన్నారు.
విరాట్ కోహ్లి ఇటీవలే వన్డే కెరీర్లో 10వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు అత్యంత వేగంగా ఈ రికార్డు సాధించిన క్రికెటర్‌గా రికార్డుల కెక్కారు. దీంతో తన భర్త విజయం పట్ల అనుష్క మరింత సంతోషంగా ఉంది. అనుష్క, విరాట్ ఎవరి ప్రొఫెషన్లో వారు బిజీగా ఉంటూనే... తమ దాంపత్య జీవితానికి సైతం సమయం కేటాయించుంటూ హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











