బికినీలో అనుష్క శర్మ.. భార్య అందాలకు విరాట్ కోహ్లీ ఫిదా.. అలియా క్రేజీగా కామెంట్!

బాలీవుడ్ తార అనుష్క శర్మ, ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీల దాంపత్య జీవితం లాక్‌డౌన్‌లో రసవత్తరంగా సాగుతున్నది. చిలిపి చేష్టలు, సరసాలతో గత 100 రోజులుగా ఎంజాయ్ చేస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ సెలబ్రిటీ జంట తమ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేసుకొంటూ నెటిజన్లకు, అభిమానులకు దగ్గరవుతున్నారు. తాజాగా అనుష్క శర్మ తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసిన బికినీ ఫోటో వైరల్ కాగా.. దానికి విరాట్ గమ్మత్తైన ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చి ఇంటర్నెట్‌లో దుమారం రేపారు. ఇంతకు విరాట్ ఏం చేశారంటే..

పాతాల్ లోక్, బుల్‌బుల్ వెబ్‌ సిరీస్‌లతో

పాతాల్ లోక్, బుల్‌బుల్ వెబ్‌ సిరీస్‌లతో

లాక్‌డౌన్‌లో విరాట్‌తో దాంపత్య జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ ‌చేస్తూనే ప్రొఫెషనల్ విషయాలను పక్కాగా ముందుకు తీసుకెళ్లారు. నిర్మాతగా మారి రెండు వెబ్ సిరీస్‌లను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. పాతాళ్ లోక్, బుల్ బుల్ వెబ్ సిరీస్‌లకు ఓటీటీలో విశేషమైన ఆదరణ దక్కింది. ఈ రెండు వెబ్ సిరీస్‌లపై విమర్శకులు ప్రశంసలతో ముంచెత్తారు.

నల్లటి బికినీలో అందాల దేవతగా

నల్లటి బికినీలో అందాల దేవతగా

ఇక దాంపత్య జీవితం, నిర్మాతగా రాణిస్తూనే ఇటీవల అనుష్క శర్మ ఫోటోషూట్‌ చేసింది. నల్లటి బికినీ ధరించిన అనుష్క ఒంటిపై పసుపు పచ్చ రంగులోని స్లీవ్‌లెస్ కోటు లాంటి దస్తులను ధరించి వోగ్ ఇండియా కవర్ పేజ్‌ ఫోటోకు ఫోజిచ్చింది. ఆ తర్వాత ఆ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయగా విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. దాదాపు 2 మిలియన్ల మంది లైక్ చేశారు.

అలియాభట్ మనసు దోచుకొన్న బికినీ ఫోటో

అలియాభట్ మనసు దోచుకొన్న బికినీ ఫోటో

ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసిన అనుష్క శర్మ ఫోటోపై నెటిజన్లు, అభిమానులే కాకుండా బాలీవుడ్ నటి అలియాభట్ కూడా కామెంట్ చేసింది. నిజమైన అందానికి నిదర్శనం అంటూ కామెంట్ పెట్టింది. ఇక నెటిజన్లు ఆమె అందాన్ని రకరకాలుగా వర్ణిస్తూ కామెంట్లు చేశారు. నెటిజన్ల కామెంట్లలో భర్త విరాట్ కోహ్లీ కూడా భాగమయ్యారు.

విరాట్ మాటలకు అందని కామెంట్‌తో

విరాట్ మాటలకు అందని కామెంట్‌తో

ఇన్స్‌టాగ్రామ్‌లో భార్య అనుష్క బికిని ఫోటో చూసిన విరాట్ ఓ గమ్మత్తైన ఎక్స్‌ప్రెషన్ పెట్టారు. మాటలకు అందని భావనను పలికించాడు. కళ్లలో ప్రేమ మెరుపులు వెలిగించి.. ఆమె అందంపై ఉన్న లవ్‌ను వ్యక్తం చేశారు. విరాట్ పోస్ట్ చేసిన ఇమోజీలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అందరూ వాటిపై కామెంట్లు పెడుతూ విరాట్‌తోపాటు ఆ ఫోటోను ఎంజాయ్ చేస్తున్నారు.

Recommended Video

#HappyBirthdayDishaPatani : Kohli,Dhoni కంటే Bumrah నే అసలైన మ్యాచ్ విన్నర్ : Disha Patani
డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటై

డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటై

అనుష్క, విరాట్ ప్రేమ, పెళ్లి విషయానికి వస్తే.. ఓ యాడ్ షూటింగులో కలిసిన తర్వాత వారిద్దరూ ఒకరికొకరు దగ్గరయ్యారు. ఆ తర్వాత చాలా ఏళ్లు ప్రేమలో పడి డేటింగ్ చేశారు. అనంతరం డెస్టినేషన్ వెడ్డింగ్‌తో 2017 డిసెంబర్‌లో ఒక్కటయ్యారు. అప్పటి నుంచి వ్యక్తిగతంగాను, ప్రొఫెషనల్‌గాను తమ లక్ష్యాల వైపు దూసుకెళ్తున్నారు. కెరీర్ పరంగా తమ గ్రాఫ్‌ను రివ్వును పరుగులు పెట్టించడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X