twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భార్య కోసం ఎవరైనా ఇలా చేస్తారా.. అనుష్క పుట్టినరోజు, కోహ్లీ ఏం చేశాడంటే!

    |

    అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ చాలా ఏళ్లుగా ప్రేమించుకుని 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. విరాట్ కోహ్లీ స్టార్ క్రికెటర్ గా ఎదుగుతున్న సమయంలో వాణిజ్య ప్రకటనల ద్వారా వీరి మధ్య పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. విరాట్, అనుష్క చాలా కాలం పాటు ప్రేమికులుగా చేట్టాపట్టాలేసుకుని తిరిగారు. 2017లో వీరిద్దరి వివాహం ఇటలీలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల మధ్య జరిగింది. ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా విరాట్, అనుష్క వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరి వివాహ జీవితం అన్యోన్యంగా సాగుతోంది. బుధవారం రోజు అనుష్క శర్మ తన 31వ జన్మదిన వేడుకని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా కోహ్లీ చేసిన ఓ పని హాట్ టాపిక్ గా మారింది.

    కోహ్లీని వదలకుండా

    కోహ్లీని వదలకుండా

    అనుష్క, కోహ్లీ ప్రేమ మొదలయ్యాక నిత్యం వార్తల్లో నిలిచేవారు. అనుష్క కోహ్లీకి నీడలా ఉంటూ ప్రతి మ్యాచ్ ని స్టేడియంకు వెళ్లి చూసేది. కోహ్లీ బాగా ఆడుతుంటే అభిమానులతో పాటు కేరింతలు కొట్టేది. అనుష్క క్రికెట్ మ్యాచ్ లని స్టేడియంకు వెళ్లి చూడడంపై విమర్శలు కూడా వచ్చాయి. వివాహం తర్వాత కూడా అనుష్క వీలు చిక్కినప్పుడల్లా కోహ్లీ ఆటని ఆస్వాదిస్తోంది.

    భార్య కోసం ఏం చేశాడంటే

    భార్య కోసం ఏం చేశాడంటే

    బుధవారం అనుష్క 31వ పుట్టినరోజుని జరుపుకుంటోంది. ఈ బర్త్ డే అనుష్క లైఫ్ లో మెమొరబుల్ గా మిగిలిపోవాలని కోహ్లీ ప్లాన్ చేశాడట. బెంగుళూరు నగరంలో ఓ రెస్టారెంట్ మొత్తాన్ని బుక్ చేసినట్లు తెలుస్తోంది. ఒక రోజు మొత్తానికి ఆ రెస్టారెంట్ ని కోహ్లీ బుక్ చేసి అందంగా డెకరేట్ చేయించాడట. ఈ రోజు మొత్తం అనుష్క, కోహ్లీ మాత్రమే ఆ రెస్టారెంట్ లో ఉండనున్నట్లు తెలుస్తోంది. తన భార్య బర్త్ డే కానుకగా కోహ్లీ ఇలా రొమాంటిక్ డేట్ ని ప్లాన్ చేశాడు.

    రహస్యంగా

    రహస్యంగా

    కోహ్లీ, అనుష్క డిన్నర్ డేట్ కు వెళ్లబోయే రెస్టారెంట్ వివరాలని యాజమాన్యం రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ ముగిశాక కోహ్లీ వరల్డ్ కప్ సన్నాహకాలతో బిజీ అయిపోతాడు. అనుష్క కూడా తన సినిమాలతో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. అనుష్క శర్మ గత ఏడాది సంజు, సూయి ధాగ లాంటి విజయవంతమైన చిత్రాల్లో నటించించింది. ఈ ఏడాది విడుదలైన జీరో చిత్రం మాత్రం నిరాశపరిచింది.

    రూమర్లని కొట్టిపారేస్తూ

    రూమర్లని కొట్టిపారేస్తూ

    కొన్ని రోజుల క్రితం అనుష్క శర్మ గర్భవతి అంటూ వార్తలు వచ్చాయి. ఆ వార్తలని ఖండించిన అనుష్క ఘాటుగా స్పందించింది. మన జీవితంలో పెళ్లి, పిల్లలు లాంటి అంశాలని దాచిపెట్టలేం. కొన్ని కారణాల వలన నేను యంగ్ ఏజ్ లోనే వివాహం చేసుకున్నా. నా వ్యక్తిగత విషయాల గురించి చర్చించవద్దు. ఆ సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు ప్రపంచానికి తెలుస్తాయి అని అనుష్క క్లారిటీ ఇచ్చింది.

    English summary
    Virat Kohli planning an intimate dinner for wife Anushka Sharma's 31st birthday. Anushka Sharma will celebrate her 31st birthday away from the limelight. It is reported that her husband Virat Kohli is planning an intimate dinner to celebrate her birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X