అనుష్క ట్వీట్ చూసి ఫ్యాన్స్ ఫిదా... విరాట్ పుట్టినరోజున ఎలా విష్ చేసిందంటే?
Recommended Video

బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజు. నేడు తన జీవిత భాగస్వామి, ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లి 30వ పుట్టినరోజు. ఈ సందర్భంగా అనుష్క ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపింది. అయితే అనుష్క విష్ చేసిన తీరు చూసి అభిమానులు ఫిదా అవుతున్నాయి.
అనుష్క శర్మ, విరాట్ కోహ్లి కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. భర్త మీద తనకు ఎంత ప్రేమ ఉందో ఒకే ఒక్క ముక్కలో అద్భుతంగా చెప్పింది ఈ బాలీవుడ్ సుందరాంది.
దేవుడా.. నీకు థాంక్స్
విరాట్‌ను పుట్టించినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.... అంటూ తనదైన శైలిలో అనుష్క విష్ చేశారు. రొటీన్ కొటేషన్స్ కాకుండా అనుష్క డిపరెంట్‌గా విష్ చేసిన తీరు అభిమానులకు తెగ నచ్చేసింది.

ఎంత బిజీగా ఉన్నా పక్కా ప్లానింగ్
అనుష్క శర్మ, విరాట్ కోహ్లి ఎవరి ప్రొఫెషన్లో వారు బిజీ బిజీగా గడుపుతుంటారు. అయితే ఎంత బిజీగా ఉన్నా తమ దాంపత్య జీవితానికి ఇబ్బంది కలగకుండా పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నారు. విరాట్ బర్త్ డేను సైతం అలాగే ప్లాన్ చేసుకున్నారు.

ఆశ్రమంలో గడుపుతున్నారు
ఈ ఇద్దరూ ఇపుడు హరిద్వార్‌లోని అనంత్ ధామ్ ఆత్మబంధ్ ఆశ్రమంలో గడుపుతున్నారు. ఈ ఆశ్రమం అనుష్క ఫ్యామిలీ ఆధ్యాత్మిక గురువు మహరాజ్ అనంత్ బాబా ఆధ్వర్యంలో నడుస్తోంది. నవంబర్ 7వ తేదీ వరకు వీరు ఇక్కడే గడుపుతారని తెలుస్తోంది.

తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీ
హరిద్వార్ పర్యటన ముగిసిన తర్వాత అనుష్క, కోహ్లి ఎవరి పనుల్లో వారు బిజీ కానున్నారు. అనుష్క ‘జీరో' మూవీ ప్రమోషన్లలో పాల్గొనబోతోంది. షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క వికలాంగురాలిగా కనిపించబోతున్నారు. డిసెంబర్ 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











