విరాట్ కోహ్లీ చేసిన పనికి.. కంటతడి పెట్టిన అనుష్క శర్మ.. బర్త్ డే రోజున అలాంటి గిఫ్ట్!

క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ దాంపత్య జీవితం సాఫీగా సుఖ: సంతోషాల మధ్య సాగిపోతున్నది. సోషల్ మీడియాలో వీరిద్దరి వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. లాక్‌డౌన్‌లో కోహ్లీ, అనుష్క మధ్య జరిగిన చిలిపి సంఘటనలు వైరల్‌గా మారాయి. తాజాగా వారిద్దరి మధ్య జరిగిన భావోద్వేగమైన సంఘటన నెటిజన్లన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఆ వివారాల్లోకి వెళితే...

యాడ్ షూటింగులో కలుసుకొని

యాడ్ షూటింగులో కలుసుకొని

యాడ్ షూటింగులో కలుసుకొన్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఒకరంటే మరొకరు ఇష్టపడ్డారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత చాలా ఏళ్లు డేటింగ్ చేస్తూ ఒకరినొకరు తెలుసుకొన్నారు. ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు.

 2017లో డెస్టినేషన్ వెడ్డింగ్

2017లో డెస్టినేషన్ వెడ్డింగ్

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వివాహం 2017లో అట్టహాసంగా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా జరిగింది. అప్పట్లో వీరిద్దరి వివాహం మీడియాలో హైలెట్‌గా మారింది. ఢిల్లీలో జరిగిన వివాహ విందుకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల వారిద్దరికి కూతురు కూడా జన్మించడం తెలిసిందే.

33వ బర్త్ డే రోజును అనుష్క శర్మ

33వ బర్త్ డే రోజును అనుష్క శర్మ


ఇలా అన్యోన్యంగా దాంపత్య జీవితం కొనసాగుతున్న నేపథ్యంలో అనుష్క శర్మ తన 33వ పుట్టిన రోజును ఘనంగా జరుపుకొన్నారు. ఈ బర్త్ డే సెలబ్రేషన్స్‌లో పలువురు స్నేహితులు, సన్నిహితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విరాట్ తన భార్య అనుష్క శర్మపై ప్రేమను గుప్పించారు.

విరాట్ కోహ్లీ పాటతో ఎమోషనల్

విరాట్ కోహ్లీ పాటతో ఎమోషనల్

అనుష్క శర్మ బర్త్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీలో విరాట్ కోహ్లీ ఏకంగా భార్య కోసం పాట పాడేశారు. మేరే మహబూబ్ ఖయామత్ హోగీ అంటూ గేయాన్ని అందుకొన్నారు. విరాట్ కోహ్లీ పాడుతున్నంత సేపు అనుష్క శర్మ ఎమోషనల్ అయ్యారు. విరాట్ పాట ముగించగానే అతిథులందరూ చప్పట్ల మోత మోగించారు. ఆ సమయంలో ఒక్కసారిగా భావోద్వేగానికి గురైన అనుష్క కంటతడి పెట్టుకొన్నారు.

Recommended Video

The Fog Movie Theatrical Trailer
అనుష్క కెరీర్ ఇలా..

అనుష్క కెరీర్ ఇలా..


అనుష్క సినీ కెరీర్ విషయానికి వస్తే.. హీరోయిన్‌గా, నిర్మాతగా రాణిస్తున్నారు. లాక్ డౌన్‌కు ముందు జీరో, అంగ్రేజీ మీడియం సినిమాలో నటించారు. లాక్‌డౌన్‌ సమయంలో పాతాళ్ లోక్, బుల్‌బుల్ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు. ప్రస్తుతం ఖాలా అనే వెబ్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ కోసం తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు బుల్‌బుల్ డైరెక్టర్ అన్విత దత్ దర్శకత్వం వహిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X