విరాట్- అనుష్క శర్మ విడాకులు? దుమారం రేపుతున్న కోహ్లీ పోస్ట్..
Virat Kohli- Anushka Sharma: ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు కామన్ అయిపోయాయి. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.. ఎవరు ఎప్పుడు విడిపోతారో? చెప్పడం చాలా కష్టం. కొత్త జంటలనుండి పాత జంటల వరకు కూడా ఇదే పరిస్థితి. తమ వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నారు. తమ మూడుముళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ - టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ విడాకులు.. తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అసలేం జరిగింది? ఎందుకు ఈ వార్తలు వైరల్ లో అవుతున్నాయి. ఓ వివరాల్లోకెళ్లే..
2024 ప్రారంభం నుంచి .. ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకులు తీసుకుంటున్నారు. ఈ ఏడాది తొలుత మ్యూజిక్ డైరెక్టర్, నటుడు జివి ప్రకాష్ కుమార్ తన భార్యతో విడిపోయారు. జివి ప్రకాష్ తన భార్య సైందవితో విడాకులు తీసుకున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత హీరో జయం రవి కూడా తన భార్యకు విడాకులు ఇచ్చి తన అభిమానులకు షాక్ ఇచ్చారు. తమ 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్టు జయం రవి ప్రకటించారు. కానీ రవి భార్య ఆర్తీ స్పందిస్తూ.. తనకు తెలియకుండా విడాకులు తీసుకున్నట్టు ప్రకటన చేసి.. అందరికీ షాక్ ఇచ్చింది. అప్పట్లో ఈ వార్త ఇండస్ట్రీలో దుమారం రేపింది.

నిన్నటి నిన్న .. ఆస్కార్ విజేత. ఏ ఆర్ రెహమాన్ కూడా తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇలా రెహమాన్, ఆయన భార్య సైరాలు తన 29 సంవత్సరాల వైవాహిక బంధాన్ని తెంచుకున్నారు. తాము వ్యక్తిగత కారణాలతో వీడిపోతున్నామనీ, తన వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లకుండా చూడాలని కోరారు. ఏఆర్ రెహమాన్ 1995లో సైరా బానుని వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ ఖతీజా, రహీమా, అమీన్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
ఇదెలా ఉంటే.. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2017లో ఇటలీలో సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. వీరికి వామిక, అకాయ్ అనే ఒక పాప, బాబు ఉన్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. ఈ జంట.. తమ పిల్లల ముఖాలను మాత్రం ప్రపంచానికి చూపించడం లేదు. దీంతో వారి పిల్లల ను ఎప్పుడెప్పుడు చూపిస్తారా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. తాజాగా విరాట్ పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట దుమారం రేపుతోంది.
కొన్నాళ్లు రిలేషన్‌లో వీరిద్దరు తర్వాత తమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. కొంతకాలం డేటింగ్ చేసిన తర్వాత, 2017లో ఇటలీలో సైలెంట్‌గా వివాహం చేసుకున్నారు. విరాట్,అనుష్క దంపతులకు కూతురు , కుమారుడు ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా విరాట్ కోహ్లీ షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు.

విరాట్ తన పోస్టు లో ఇలా రాసుకొచ్చారు. ' వెనక్కి తిరిగి చూసుకుంటే.. మేము ఎప్పుడూ కాస్త భిన్నంగా ఉంటాం. మేం ఒక అభిరుచికి మాత్రమే పరిమితం కాలేదు. ఆరంభంలోనే మేమేంటో అందరికీ తెలిసినా.. రెండుసార్లు మిస్‌ఫిట్ అయ్యాం. అయితే.. కొందరు మమ్మల్ని వెర్రివాళ్ళని పిలిచారు. ఇతరులు దానిని ఆమోదించలేదు. కానీ..వాటిని ఎప్పుడూ మేం పట్టించుకోలేదు. కానీ, ప్రస్తతం మేము ఎవరో తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నాం. గడిచిన 10 ఏండ్లు జయాపజయాలు, మహమ్మారి కూడా మనల్ని కదిలించలేకపోయింది. 10 ఏళ్ల కిందట సరైనదనే అనిపించిన విషయం ఇప్పుడు సరైనది కావొచ్చు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి అన్నీ చూసుకుంటూ వెళ్లిపోవాలి' అంటూ రాసుకొచ్చారు విరాట్ కోహ్లీ.
ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ కావడంతో విరాట్ కోహ్లీ.. అనుష్కకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యారంటూ కామెంట్స్ పెడుతున్నాయి. ఈ విషయం అటు బాలీవుడ్ లోనూ.. ఇటు కీడ్రా ప్రపంచంలోనూ ఆందోళన కలిగిస్తోంది. కోహ్లీ ఇలా ఎందుకు పోస్టు చేశారో.. ఏ విషయం గురించి పోస్టు చేశారో? క్లారిటీ ఇవ్వాలని వారు కోరుతున్నారు


Click it and Unblock the Notifications











