జంటగా ఏలేస్తున్నారు... విరుష్కా జోడీకి టాప్ బ్రాండ్లు ఫిదా...
చూడముచ్చటైన విరుష్కా జోడీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులుఉన్నారు అనడంలో సందేహమే లేదు. ఎక్కడికి వెళ్లినా అందరి చూపూ ఈ జంటపైనే ఉంటాయని అంటుంటారు. పీడీఏలో ఏమాత్రం మొమహాట పడని విరాఠ్ అనుష్కా తాజాగా మరో ఘనతను కూడా సాధించారు.
పెళ్లికి ముందు నుంచే వీరి జంటకు ప్రకటనల ప్రపంచంలో మంచి డిమాండ్ నెలకొన్న సంగతి తెలిసిందే. ఇక పెళ్లైన నాటి నుంచి టాప్ బ్రాండ్స్ కు అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్న విరాట్, అనుష్కా... ఈ విషయంలో హేమాహేమీలైన టాప్ సెలబ్రిటీ కపుల్స్ ను కూడా మించిపోయారు. అక్షయ్ కుమార్- ట్వింకిల్ ఖన్నా, సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ వంటి జంటలను వెనక్కు నెట్టి నెంబర్ వన్ పొజిషన్ ను కైవసం చేసుకుంది విరుష్కా జోడీ.

2020 తొలి ఆర్ధిక సంవత్సరానికి గానూ టామ్ ఎడెక్స్ విడుదల చేసిన నివేదిక ప్రకారం అత్యధిక బ్రాండ్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న జంటగా విరాట్-అనుష్కా నిలిచారు. 26శాతం భాగస్వామ్యంతో మొత్తం 16 బ్రాండ్లకు వీరు ప్రచారం చేస్తున్నారు. రణ్ వీర్ -దీపిక, అమితాబ్ -జయ, రితేష్-జెనీలియా, అజయ్ దేవగణ్-కాజోల్ సైతం వీరితో పోటీపడలేక చేతులెత్తేశారు అంటే.. విరుష్కా జంట స్పీడు ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి చూడముచ్చటైన ఈ జంట, సెకండ్ హాఫ్ లో ఇంకెంత చెలరేగిపోతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











