twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సడక్ 2పై వీహెచ్‌పీ నిషేధ అస్త్రం.. RRRపై ఆలియా ఎఫెక్ట్!

    |

    చివరకు అనుకున్నంతా జరుగుతోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో నెపోటిజం పై ఉవ్వెత్తిన ఎగసిన చర్చ, సడక్ 2పై భారీ ప్రభావం చూపుతోంది. ట్రైలర్ విడుదలైన కాసేపటికే సుమారు 40లక్షల డిస్ లైక్ లు పొందిన సినిమాగా సడక్ 2 రికార్డు సృష్టించింది. తాజాగా విశ్వహిందూ పరిషత్ ఏకంగా సినిమాపై బ్యాన్ విధించాలంటూ డిమాండ్ చేస్తోంది.

    వారి సెటైర్లే... వారికి తలనొప్పిగా మారాయా!

    వారి సెటైర్లే... వారికి తలనొప్పిగా మారాయా!

    సుశాంత్ మరణంలో సడక్ డైరెక్టర్ మహేశ్ భట్, నిర్మాత ముఖేశ్ భట్ హస్తం ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తడం, గతంలో ఆలియా భట్, సుశాంత్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, అన్నీ సడక్ 2పై తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. సినిమాపై నెటిజెన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ట్రైలర్ లో పలు సన్నివేశాలు హందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయి అంటూ విశ్వ హిందూ పరిషత్ వారు సైతం సినిమాపై బ్యాన్ విధించాల్సిందేనంటూ గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.

    మనోభావాలు దెబ్బతింటున్నాయా!

    మనోభావాలు దెబ్బతింటున్నాయా!

    సడక్ 2 పోస్టర్ విడుదలైనప్పుడే అది హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని ఆచార్య చంద్ర కిశోర్ అనే వ్యక్తి ముజాఫర్ పూర్ కోర్ట్ కేసు ధాఖలు చేశారు. తాజాగా విశ్వహిందూ పరిషత్ సైతం అదే వాదన వినిపిస్తోంది.

     ఆలియా కెరీర్ పై కమ్ముకున్న నీలి మేఘాలు..!

    ఆలియా కెరీర్ పై కమ్ముకున్న నీలి మేఘాలు..!

    మరోవైపు తాజా పరిణామాలతో మహేశ్ భట్ తనయ ఆలియా భట్ పైనా గట్టి ప్రభావమే చూపుతున్నాయి. ఆమె సినిమాల పైనా దీని ప్రభావం ప్రస్తుటంగా కనిపిస్తోంది. అయితే ఇప్పట్లో నెపోటిజం పై జరుగుతున్న రచ్చకు ఫుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపించడంలేదు. దీంతో ఆమెతో ఒప్పందాలు కుదుర్చుకున్న దర్శక-నిర్మాతలు డైలమాలో పడ్డారు.

    Recommended Video

    Sushant Singh Rajput : Rhea Chakraborty తో గొడవ కారణంగానే Sushant సూసైడ్ చేసుకున్నాడా ?
     ఆర్ ఆర్ ఆర్ కు ఆమె మైనెస్సేనా...!

    ఆర్ ఆర్ ఆర్ కు ఆమె మైనెస్సేనా...!

    ఇక టాలీవుడ్ కూ ఈ సెగ గట్టిగానే తాకేట్టు కనిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా ఆర్ ఆర్ ఆర్ లో ఆలియా నటించబోతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో సినిమాకు హైప్ తీసుకువచ్చేందుకే ఆలియా ఎంపికకు ప్రధాన కారణమన్న సంగతి విదితమే. అయితే తాజా పరిస్థితుల దృష్ట్యా ఆర్ఆర్ఆర్ కు ఆమె నెగిటివ్ అవుతుందే తప్ప, ప్లస్ అయ్యే పరిస్థితులు కనిపించడంలేదు. మరిప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి ఏం చేస్తారో చూడాలి.

    English summary
    Nepotism debate hits Sadak 2 badly as the trailer gets More than 4 million dislikes. And VIshwahindu parishad bans the film siting the trailer of the film hurting the religious sentiments of the major community. On the otherhand Alia is considered negative effect for RRR.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X