ఇర్ఫాన్, రిషి తర్వాత.. నసీరుద్దీన్ షా ఆరోగ్యంపై రూమర్లు..

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గత రెండు రోజుల్లో ఇద్దరు అగ్ర నటులు రిషి కపూర్, ఇర్ఫాన్ ఖాన్‌ను కోల్పోవడంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఇంకా ఈ విషాద వార్తల నుంచి కోలుకోక ముందే మరో విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా అరోగ్యం గురించి మీడియాలో రూమర్లు రావడంతో మళ్లీ సినీ అభిమానులు, ప్రేక్షకులు ఉలిక్కిపడ్డారు. బాలీవుడ్‌కు ఏమైందనే నిరాశలో మునిగిపోతుండగా నసీరుద్దీన్ షా కుమారుడు వివాన్ షా తన తండ్రి ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చారు. వివరాల్లోకి వెళితే..

Recommended Video

Irrfan Khan, Rishi Kapoor Now Actor Naseeruddin Shah...Rumours In Media
గురువారం సాయంత్రం రూమర్లు

గురువారం సాయంత్రం రూమర్లు

రిషికపూర్ అంత్యక్రియలు ముగిసిన తర్వాత కాసేపటికే నసీరుద్దీన్ షా ఆరోగ్యం విషమించింది. ఆయనను హాస్పిటల్‌లో చేర్పించారు. ఆయన ఆరోగ్య పరిస్థితులపై టెలివిజన్‌లో బ్రేకింగులు, రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దాంతో ఆయన కుమారుడు వివిన్ సోషల్ మీడియాలో స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం బాగుంది అంటూ చెప్పడంతో సినీ లోకం ఊపిరి పీల్చుకొన్నది.

తండ్రి ఆరోగ్యంపై వివాన్ షా వివరణ

తండ్రి ఆరోగ్యంపై వివాన్ షా వివరణ

ఫేస్‌బుక్‌లో వివాన్ షా స్పందిస్తూ.. నాన్న ఆరోగ్యం బాగుంది. ఎలాంటి ఆందోళన చెందవద్దు. ఆయన ఆరోగ్యంపై వస్తున్న రూమర్లు అంతా ఫేక్. ఇలాంటి వదంతులను నమ్మవద్దు. ఎలాంటి సమాచారం ఉన్నా తాను స్పందిస్తాను. అప్పటి వరకు రూమర్లను నమ్మవద్దు. నా తండ్రి ఆరోగ్యంపై ఆందోళన పడిన వారందరికి నా ధన్యవాదాలు. మీలాంటి ప్రేమను నాన్న పొందడం గొప్ప విషయం అంటూ వివాన్ షా మీడియాలోను, సోషల్ మీడియాలోను స్పందించారు.

రిషి, ఇర్ఫాన్ ఖాన్‌కు సంతాపం

రిషి, ఇర్ఫాన్ ఖాన్‌కు సంతాపం

ఈ లోకాన్ని వీడిన ఇర్ఫాన్ భాయ్, చింటూ జీకి నా ప్రగాఢ సంతాపం. వారు ఏ లోకాన ఉన్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారు లేరనే వార్త చాలా బాధగా ఉంది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం. ఇలాంటి విషాద సమయంలో వారికి మనమంత అండగా ఉండి మానసిక స్థైర్యం ఇవ్వాలి. వారు లేని లోటు మాటల్లో చెప్పలేనిది అంటూ వివాన్ షా తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నారు.

 ప్రస్తుతం లాక్‌డౌన్‌లోనే

ప్రస్తుతం లాక్‌డౌన్‌లోనే

ప్రస్తుతం నాన్న, మేము అంతా ఇంటిలోనే ఉంటూ లాక్‌డౌన్ పాటిస్తున్నాం. కరోనా సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నాం. నసీరుద్దీన్ ఆరోగ్యం గురించి ఎలాంటి ఆందోళన పడొద్దు. మీరు కూడా ఇంటి పట్టునే ఉంటూ ఆరోగ్యాన్ని మంచి చూసుకొండి అంటూ వివాన్ షా ఓ ప్రకటనలో తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X