twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘ది తాష్కెంట్ ఫైల్స్’ మూవీ ఆపండి.. కోర్టుకెక్కిన మాజీ ప్రధానమంత్రి మనవళ్లు!

    |

    భారత మాజీ, రెండవ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి మరణం వెనక ఉన్న మిస్టరీ గురించి వివరిస్తూ తెరకెక్కిన చిత్రం 'ది తాష్కెంట్ ఫైల్స్'. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదల నిలిపి వేయాలని కోరుతూ దర్శకుడికి లీగల్ నోటీసులు అందాయి.

    లాల్ బహదూర్ శాస్త్రి మనవళ్లు విభాకర్ శాస్త్రి, దివాకర్ శాస్త్రి ఈ లీగల్ నోటీసులు పంపారు. లాల్ బహదూర్ శాస్త్రి మరణంపై అనవసరమైన వివాదాన్ని క్రియేట్ చేసేందుకే ఈ సినిమా తెరకెక్కిస్తున్నారని వారు తమ లీగల్ నోటీసుల్లో పేర్కొన్నారు.

    మిస్టరీగా లాల్ బహదూర్ శాస్త్రి మరణం

    మిస్టరీగా లాల్ బహదూర్ శాస్త్రి మరణం

    లాల్ బహదూర్ శాస్త్రి భారత రెండవ ప్రధాన మంత్రిగా పని చేశారు. ఆయన పదవిలో ఉన్నపుడే 1965 ఇండో-పాకిస్థాన్ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధం 1966 జనవరి 10న తాష్కెంట్ ఒప్పందం ద్వారా యుద్ధం ముగిసింది. ఒప్పందం జరిగిన మరుసటి రోజు తాష్కెంట్లో శాస్త్రి గుండెపోటుతో మరణించినట్లు చెప్పబడింది. ఆయనది సహజ మరణం కాదని, హత్య అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ మిస్టరీ చుట్టూ ‘ది తాష్కెంట్ ఫైల్స్' సినిమా నడుస్తుంది.

    లీగల్ దర్శకుడు ఏమంటున్నారంటే..

    లీగల్ దర్శకుడు ఏమంటున్నారంటే..

    లీగల్ నోటీసులపై వివేక్ అగ్నిహోత్రి రియాక్ట్ అయ్యారు. శాస్త్రి మనవళ్లను ఒక టాప్ ఫ్యామిలీ కంట్రోల్ చేస్తోందని ఆరోపించారు. ఇంతకు ముందు ఈ చిత్రం చూపించినపుడు వారు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు, ఇప్పుడేంటి? సమస్య అని ప్రశ్నించారు. వివేక్ టాప్ ఫ్యామిలీ అని చేసిన వ్యాఖ్యలు గాంధీ ఫ్యామిలీ గురించే అనే వాదన తెరపైకి వచ్చింది.

    వారిని నుంచి ఒత్తిడి వల్లనే

    వారిని నుంచి ఒత్తిడి వల్లనే

    ‘‘ఈ చిత్రాన్ని వారికి నేను ఏప్రిల్ 7న ఢిల్లీలోని పివిఆర్ థియేటర్లో చూపించాను. సినిమా చూసిన అనంతరం బావుందంటూ నన్ను ప్రశంసించారు. కానీ ఇపుడు సినిమాను ఆపమంటున్నారు. వారికి ఆ టాప్ ఫ్యామిలీ నుంచి ఒత్తిడి ఎదురవ్వడం వల్లే ఇలా చేస్తున్నారని భావిస్తున్నాను.'' అని వివేక్ చెప్పుకొచ్చారు.

    అందుకే ఈ సినిమా గురించి భయపడుతున్నారా?

    అందుకే ఈ సినిమా గురించి భయపడుతున్నారా?

    టాప్ కాంగ్రెస్ లీడర్లు ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఎందుకు ఈ సినిమా ఆపాలనుకుంటున్నారు? సినిమా రిలీజ్ కాకుండా ఎందుకు బెదిరిస్తున్నారు? ఇది రిలీజైతే ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతాయనా? అందుకే భయపడుతున్నారా? అంటూ వివేక్ ప్రశ్నించారు.

    ‘ది తాష్కెంట్ ఫైల్స్’

    ‘ది తాష్కెంట్ ఫైల్స్’

    ‘ది తాష్కెంట్ ఫైల్స్' చిత్రంలో నసీరుద్ధీన్ షా, మిథున్ చక్రవర్తి, శ్వేతా బసు ప్రసాద్, పల్లవి జోషి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 12న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఈలోపే సినిమా ఆపాలంటూ నోటీసులు అందాయి.

    English summary
    Vivek Agnihotri has received a legal notice seeking a stay on the release of "The Tashkent Files". Former Prime Minister Lal Bahadur Shastri's grandsons Vibhakar Shastri and Diwakar Shastri sent this notice.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X