ఐశ్వర్యరాయ్‌పై వివేక్ ఒబేరాయ్ వివాదాస్పద ట్వీట్.. మండిపడ్డ సోనమ్ కపూర్
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్‌పై హాట్ హాట్‌గా చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబేరాయ్ వివాదాస్పద ట్వీట్‌ను రీట్వీట్ చేయడం సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తున్నది.
ఎగ్జిట్ పోల్స్‌ను ఉద్దేశించి ఓ నెటిజన్ షేర్ చేసిన మెమెను వివేక్ ఒబేరాయ్ షేర్ చేశాడు. అందులో ఏమున్నదంటే... ఓపినియన్ పోల్ అంటే ఐశ్వర్యరాయ్‌తో సల్మాన్ ఖాన్ అఫైర్ ఉన్నట్టు.. ఎగ్జిట్ పోల్ అంటే తనతో ఐష్ ఉన్నట్టు.. చివరకు ఫలితం అంటే అభిషేక్ బచ్చన్‌ను ఐశ్వర్యరాయ్ పెళ్లి చేసుకొని పిల్లపాపలతో ఉన్నట్టు అని అర్ధం వచ్చేలా మెమె ఉంది. ఆ ఫొటోను షేర్ చేసి దీనిని రాజకీయం చేయవద్దు.. జస్ట్ ఫర్ ఫన్ అని ట్వీట్ వివేక్ ఒబేరాయ్ చేశాడు.

సల్మాన్ ఖాన్ చేసిన ట్వీట్ కొద్ది గంటల్లోనే ట్విట్టర్‌లో వైరల్‌గా మారి.. ట్రెండ్ అవుతూ వచ్చింది. చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. అయితే సోనమ్ కపూర్ మాత్రం మండిపడింది. చాలా దారుణంగా ఉంది.. లేకి తనానికి నిదర్శనం అంటూ కామెంట్ పెట్టింది.
ఐశ్వర్య రాయ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. తొలుత సల్మాన్ ఖాన్‌తో ప్రేమలో పడింది. ఆ తర్వాత వారిద్దరి లవ్ బ్రేకప్ జరగడం ఆ తర్వాత వివేక్ ఒబేరాయ్‌తో అఫైర్ నడింపింది. చివరకు అభిషేక్ బచ్చన్‌ను వివాహం చేసుకొన్నారు. ఈ కాల చక్రాన్ని ఎగ్జిట్ పోల్స్‌కు ఆపాదిస్తూ నెటిజన్ మెమె సృష్టించడం అతడి క్రియేటివికి అద్దం పట్టిందని వివేక్ ఒబేరాయ్ కామెంట్ పెట్టడంతో అది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











