twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఐశ్వర్యతో అఫైర్: సల్మాన్ చంపుతానని బెదిరించాడు.. నాపై ఫత్వా.. ఆఫర్లు లేకుండా చేశారు.. వివేక్ ఒబేరాయ్

    |

    ప్రపంచ సుందరి, హీరోయిన్ ఐశ్వర్యరాయ్‌ విషయంలో 16 ఏళ్ల క్రితం హీరోలు సల్మాన్ ఖాన్, వివేక్ ఒబెరాయ్ గొడవ పడిన సంఘటన బాలీవుడ్‌లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాలం గడిచిపోయిన ఆ సంఘటన వివేక్ ఒబేరాయ్‌ని వెంటాడుతున్నట్టు స్పష్టమవుతున్నది. పీఎం నరేంద్రమోదీ చిత్ర ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వివేక్ ఒబేరాయ్ ఆ ఘటన గురించి మరోసారి స్పందించాడు. ఆ ఘటన గురించి వివేక్ ఏమన్నారంటే...

     నన్ను క్షమిస్తావా సల్మాన్ ఖాన్?

    నన్ను క్షమిస్తావా సల్మాన్ ఖాన్?

    16 ఏళ్ల క్రితం జరిగిన గొడవ గురించి సల్మాన్ ఖాన్‌ను ఓ ప్రశ్న అడుగాలనుకొంటున్నాను. నీ జీవితంలో ఎవరినైనా క్షమించిన దాఖలాలు ఉన్నాయా? లేదా క్షమించడం అనేది మీరు నమ్ముతారా అని అడుగుతాను అని వివేక్ చెప్పారు. అప్పుడు జరిగిన విషయాల గురించి గుర్తు చేసుకొన్నారు.

    సల్మాన్ పీకల్లోతు మద్యం సేవించి..

    సల్మాన్ పీకల్లోతు మద్యం సేవించి..

    2003లో వివేక్ ఒబేరాయ్ నిర్వహించిన మీడియా సమావేశం బాలీవుడ్‌ను కుదిపేసింది. ఆ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సల్మాన్ ఖాన్ నాకు 41 సార్లు ఫోన్ చేశాడు. పీకల్లోతు మద్యం సేవించి ఉన్నాడు. నన్ను చంపేస్తానని ఫోన్‌లో బెదిరించాడు. నా ప్రియురాలు ఐశ్వర్యరాయ్‌కి దూరంగా ఉండకపోతే ఎంతకైనా తెగిస్తానని బెదిరించారు అని వివేక్ వెల్లడించడం షాక్ గురిచేసింది.

    ముఖం చాటేసిన నిర్మాతలు

    ముఖం చాటేసిన నిర్మాతలు

    వివేక్ ఒబెరాయ్ నిర్వహించిన సమావేశం అప్పట్లో బాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించాయి. ఆ సమావేశ ప్రభావం వివేక్ కెరీర్‌పైనే కాకుండా.. ఐశ్వర్యరాయ్‌పైనా కూడా పడింది. బాలీవుడ్‌లో వివేక్ పతనానికి కూడా కారణమైందని సినీ వర్గాలు చెప్పుకొంటాయి. ఆ సంఘటన తర్వాత వివేక్‌కు అవకాశాలు ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రాలేదనేది అప్పట్లో వార్త.

    జీవితంలో అనేక సమస్యలు

    జీవితంలో అనేక సమస్యలు

    16 ఏళ్ల క్రితం మీడియా సమావేశం నా జీవితంలో రకరకాలుగా సమస్యలను తీసుకొచ్చింది. బాలీవుడ్‌లో కొంతమంది పవర్‌ఫుల్ వ్యక్తులు నాపై ఫత్వా విధించినంత పనిచేశారు. ఆ సమయంలో షూట్‌ అవుట్ ఎల్ లోఖండ్‌వాలా భారీ విజయం సాధించినా.. సినిమాలు లేక ఏడాదిపాటు ఇంట్లో కూర్చున్నాను. నా వ్యక్తిగత జీవితం చిన్నాభిన్నమైంది అని వివేక్ చెప్పుకొచ్చారు.

    మళ్లీ ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ వివేక్ ఒబేరాయ్

    మళ్లీ ఇప్పుడిప్పుడే గాడిలో పడ్డ వివేక్ ఒబేరాయ్

    అప్పటి నుంచి వివేక్ కెరీర్ పుంజుకోలేకపోయింది. తమిళ చిత్రం వివేకంతో విలన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. తెలుగులో రక్త చరిత్ర, వినయ విధేయ రామ కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ప్రధాని మోదీ జీవితం ఆధారంగా పీఎం నరేంద్రమోదీ సినిమా తెరకెక్కింది. ఎన్నికల కారణంగా ఆ సినిమా విడుదలను ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది.

    English summary
    Bollywood actor Vivek Oberoi, who has been in the news of late for his biopic on 'PM Narendra Modi', has stirred up a sixteen-year-old row with Salman Khan. He told the portal that he would ask Salman, "Do you truly believe in forgiveness?"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X