twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మోడీతో సెల్ఫీలు తీసుకునే స్టార్లు.. 600 మంది ఆయనకు వ్యక్తిరేకంగా.. వివేక్ ఒబెరాయ్ సంచలనం!

    |

    ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బయోపిక్ చిత్రాల జోరు కనిపిస్తోంది. సినీ రాజకీయ ప్రముఖుల జీవిత చరిత్రలపై దర్శకులు బయోపిక్ చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ జీవిత చరిత్రపై కూడా 'పీఎం నరేంద్ర మోడీ' చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతుండడంతో ఈ చిత్ర విడుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పీఎం నరేంద్ర మోడీ చిత్రాన్ని ఏప్రిల్ 6నే విడుదల చేయాలని భావించారు. కానీ సుప్రీం కోర్టు ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నరేంద్ర మోడీ బయోపిక్ ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా వివేక్ ఒబెరాయ్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

     సెల్ఫీలు దిగే స్టార్లు

    సెల్ఫీలు దిగే స్టార్లు

    వివేక్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ లో చాలా మంది మోడీతో సెల్ఫీలు దిగే స్టార్లు ఉన్నారు. మోడీతో సెల్ఫీలు దిగగానే సరిపోదు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రాన్ని అండగా నిలబడాలి. పీఎం మోడీ చిత్రానికి మద్దతుగా ఎవరూ నిలబడలేదని వివేక్ ఒబెరాయ్ అన్నారు. మోడీతో సెల్ఫీలు దిగడం చాలా సులువైన పని. కానీ చిత్ర పరిశ్రమ మొత్తం ఐకమత్యంతో ఉండాలి. ఏ చిత్రనికైనా ఇబ్బంది తలెత్తినప్పుడు అందరూ అండగా నిలబడాలి అని వివేక్ అన్నారు.

     600 మంది వ్యతిరేకంగా

    600 మంది వ్యతిరేకంగా

    బాలీవుడ్ లో దాదాపు 600 మంది ఆర్టిస్టులు మోడీ తిరిగి అధికారంలోకి రాకూడదని కోరుకుంటున్నట్లు వివేక్ ఒబెరాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే పీఎం మోడీ చిత్రానికి ఎవరూ మద్దతు తెలపడం లేదు. ఇతర సమస్యలపై అంతా మాట్లాడుతారు. కానీ సినిమాకు ఏదైనా సమస్య ఎదురైతే మాత్రం ఎవరూ మాట్లాడారు అని వివేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

    సెన్సార్ ఓకే

    సెన్సార్ ఓకే

    పీఎం నరేంద్ర మోడీ చిత్రాన్ని వాయిదా వేయడానికి వీల్లేదని సుప్రీం కోర్టు మంగళవారం తీర్పు నిచ్చింది. దీనితో సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి యూ సర్టిఫికెట్ జారీ చేశారు. గురువారం రోజు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 130 నిమిషాల నిడివితో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఒమంగ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు.

    9 గెటప్పులలో

    9 గెటప్పులలో

    ప్రధాని నరేంద్ర మోడీ పాత్రలో వివేక్ ఒబెరాయ్ 9 గెటప్పులలో కనిపించబోతున్నాడు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా మొదలు మోడీ వివిధ వయసులలో వివేక్ ఒబెరాయ్ కనిపించబోతున్నాడు. బోమన్ ఇరానీ, జరీనా వాహబ్ కీలక పాత్రల్లో నటించారు. ఇక సెన్సార్ సభ్యులు పీఎం నరేంద్ర మోడీ చిత్రంలో 11 వివాదాస్పద సన్నివేశాల్ని తొలగించాలని ఆదేశించినట్లు తెలుస్తోంది.

    English summary
    Vivek Oberoi slams Bollywood: Posting selfies with PM Narendra Modi is easy. Why not support our film
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X