twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాలాకోట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎటాక్‌పై వివేక్ ఒబెరాయ్ సినిమా

    |

    ప్రధాన మంత్రి నరేంద్రమోడీ బయోపిక్‌లో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ త్వరలో మరో ఆసక్తికర సినిమాను నిర్మించబోతున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని బాలాకోట్‌లోని ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన దాడి ఘటన ఆధారంగా సినిమాగా రాబోతోంది. దీనికి వివేక్ ఒబెరాయ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

    'బాలాకోట్' పేరుతో ఈ సినిమా ఉండబోతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ తన విమానంతో ఎలా దాడి చేశాడు? పాక్ విమానాన్ని కూల్చిన అతడు ఎలాంటి పరిస్థితుల్లో పాక్ సైన్యానికి చిక్కాడు, అక్కడి నుంచి ఇండియా చేరుకునే క్రమంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? ధైర్య సాహసాలు ప్రదర్శించిన తీరు ఈ మూవీలో చూపించబోతున్నట్లు సమాచారం.

    " భారతీయుడిగా, దేశభక్తుడిగా, సినిమా రంగానికి చెందిన వాడిగా మన సాయుధ దళాల సామర్థ్యం ఏమిటో సినిమాలో హైలైట్ చేసి చూపించడం నా కర్తవ్యం. మూడు భాషల్లో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రం ధైర్యవంతుల విజయాలు ఎత్తిచూపే శక్తివంతమైన సాధనం, వింగ్ కమాండర్ అభినందన్ వంటి అధికారులు ప్రతి భారతీయుడు గర్వించేలా చేసారు "అని వివేక్ ఒబెరాయ్ అన్నారు.

    Vivek Oberoi to produce movie on Balakot IAF strikes

    "బాలకోట్ వైమానిక దాడి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఎఎఫ్) నిర్వహించిన ప్రణాళికాబద్ధమైన దాడులలో ఒకటి. పుల్వామా దాడి నుంచి బాలకోట్లో వైమానిక దాడుల వరకు అన్ని విషయాలు నేను ఫాలో అయ్యాను. ఆ సమయంలో రకరకాల ప్రచారం జరిగింది. కొన్ని వార్తలు ప్రజలను అయోమయానికి గురి చేసే విధంగా ఉన్నాయి. ఈ చిత్రం అందరికీ ఒక క్లారిటీ ఇచ్చే విధంగా ఉంటుంది. ఈ కథ మేము బాగా తీస్తామని విశ్వసించినందుకు ఐఎఎఫ్‌కు కృతజ్ఞతలు, మేము ఈ సినిమాకు బాగా తీయగలమనే పూర్తి నమ్మకంతో ఉన్నాము'' అన్నారు.

    హిందీ, తమిళం, తెలుగు భాషలలో చిత్రీకరించబడే ఈ చిత్రంలో ఆయా పరిశ్రమల నుండి ప్రముఖ నటులను కీలక పాత్రలకు ఎంపిక చేయనున్నారు. విర్ చక్ర అవార్డు పొందిన వింగ్ కమాండర్ అభినందన్ రియల్ ఫుటేజీ ఇందులో చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 2019లోనే షూటింగ్ ప్రారంభించి 2020లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

    English summary
    Actor Vivek Oberoi will produce a movie based on the Balakot air strikes to salute the valour of the Indian Air Force (IAF).
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X