Waheeda Rehman దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడంపై వహీదా ఏమన్నారంటే?
ఇండియన్ సినిమా పరిశ్రమలో సీనియర్ నటి వహీదా రెహ్మన్ అరుదైన గౌరవం దక్కింది. సినీ పరిశ్రమకు చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆమెను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. సీనియర్ నటి వహీదా రెహ్మాన్‌కు కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించిందని కేంద్ర సమాచార, ప్రసార శాఖా మంత్రి అనురాగ్ సింగ్ థాకూర్ తన ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. తనకు ఈ అవార్డు రావడంపై వహీదా రెహ్మన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ అవార్డు తర్వాత ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే???
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు రావడం చాలా హ్యాపీగా ఉంది. ప్రభుత్వం నుంచి అత్యున్నత అవార్డు లభించింది. ఈ అవార్డు ప్రకటించిన కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ థాకూర్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని వహీదా రెహ్మాన్ అన్నారు.

నేను సినిమాలు చేసినప్పుడు నాలో కొన్ని ఆలోచనలు ఉండేవి. మహిళలకు స్పూర్తి, పురోగతి కలిగించే సినిమాల్లో చేయాలని అనిపించేది. మహిళలకు ఏది నచ్చితే అది చేయాలను ధైర్యం రావాలి. దశాబ్దాలుగా మహిళలు ఏదైనా చేయాలనుకొంటే అడ్డుకొనే శక్తులు ఎక్కువగా ఉండేవి. చదువకోవాలన్నా.. స్వేచ్ఛగా ఏదైనా రాయాలన్నా.. కొన్ని వర్గాలు మహిళల భావాలను అణిచి వేసేవారు అని వహీదా రెహ్మాన్ అన్నారు.
నేను బెంగళూరులో ఉండే సమయంలో ఎంతో మందిని కలిశాను. మా ఫ్యాక్టరీలో పనిచేసే వారికి రాయడం, చదవడం రాకపోయేది. కేవలం వేలి ముద్రలు వేసుకొని సంపాదించే వారు. పెన్నుతో సంతకాలు చేయడం రాకపోయేది.. ఇంక్ సిరాతో వేలి ముద్రలు వేసి పత్రాలపై సంతకాలు చేసేవారు. సంతకాలు చేయాలంటే ఎంబీఏ, ఇంకా ఏదో చదివి ఉండాలని కాదు. వారికి కనీస అర్హతతో తమకు సంబంధించిన విషయాలు తెలిసే ఉండాలనిపించేది అని వహీదా రెహ్మాన్ అన్నారు.
మహిళలకు అపారమైన శక్తి ఉంది. వెలకట్టలేని మేధస్సు ఉంది. వారు సరియైన రీతిలో తమ మార్గాన్ని ఎంచుకొంటే సక్సెస్ కావడం కష్టం కాదు అని ఆమె అన్నారు.


Click it and Unblock the Notifications











