సినిమాకు 50 కోట్లకు పైనే రెమ్యునరేషన్.. ఆస్తులు అమ్ముకునే దుస్థితికి హీరో

సినీ పరిశ్రమ విచిత్రమైనది లగ్జరీ లైఫ్ అనుభవించిన నటీనటులు, పూటకి గతి లేనిస్థితికి చేరుకుంటారు. కోట్ల రూపాయల ఆస్తులతో అపర కుబేరులుగా వెలుగొందిన వారు ఆస్తులు కోల్పోయి బీకార్లుగా జీవితం సాగుతుంటారు. తాజాగా ఓ స్టార్ హీరో సినిమాకు ఏకంగా రూ.50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటున్నప్పటికీ.. ఇప్పుడు ఆస్తులు అమ్ముకునే పరిస్ధితి నెలకొంది. ఆ హీరో ఎవరు? ఆస్తులు ఎందుకు అమ్ముకుంటున్నాడు? ఈ వివరాల్లోకి వెళితే..

గ్రీకు వీరుడిలాంటి రూపంతో హృతిక్ రోషన్
తేనేకళ్లు, కండలు తిరిగిన శరీరం, గ్రీకు వీరుడి లాంటి రూపంతో అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలుగొందుతున్నారు బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్. సామాన్యులే కాదు హీరోయిన్లు కూడా హృతిక్ అభిమానులే అంటే అతిశయోక్తి కాదు. తమకు కాబోయే భర్త హృతిక్‌లా ఉండాలని ఎంతో మంది కలగన్నారు. ఆయన పెళ్లియినప్పుడు ఎంతో మంది అమ్మాయిలు గుండెలు బద్ధలయ్యాయి. దశాబ్ధాలుగా యాక్షన్, లవ్, రొమాంటిక్ సినిమాలతో అలరిస్తున్నారు హృతిక్ రోషన్.

War 2 Actor Hrithik Roshan sells his properties in mumbai

ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్
బాలీవుడ్ దర్శక నిర్మాత రాకేష్ రోషన్ కుమారుడే హృతిక్ రోషన్. బలమైన సినీ నేపథ్యం ఉండటంతో బాలనటుడిగానే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించారు హృతిక్. 2000లో కహోనా ప్యార్ హై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. నటనకు మించి ఆయన డ్యాన్సింగ్ స్కిల్స్‌ అద్భుతం. భారతదేశంలో ప్రస్తుతం ఉన్న నటుల్లో బెస్ట్ డ్యాన్సర్ ఎవరంటే ఖచ్చితంగా హృతిక్ పేరు ముందు వరుసలో ఉంటుంది.

వార్ 2కు భారీ రెమ్యునరేషన్
నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, సింగర్‌గా భారతీయ చిత్ర పరిశ్రమపై తన ముద్ర వేశారు హృతిక్. మధ్యలో వరుస ఫ్లాప్స్‌తో తడబడినా తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యారు. వెండితెరతో పాటు బుల్లితెరపైనా ఆయన దమ్ము చూపిస్తున్నారు. పలు రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వార్ -2లో హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ వార్ 2లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా నిర్మిస్తున్న ఈ సినిమాను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా ఈ ఏడాది ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు గాను ఏకంగా హృతిక్ రోషన్ రూ.50 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు బాలీవుడ్ టాక్. ఈ సినిమా తర్వాత క్రిష్ 4లో హృతిక్ నటించనున్నారు.

Take a Poll

ఆస్తులు అమ్ముకుంటున్న హృతిక్
ఈ రేంజ్‌లో తన హవా చూపిస్తున్న హృతిక్ రోషన్ ముంబైలో తనకున్న అత్యంత ఖరీదైన ఆస్తులను అమ్ముకుంటున్నారట. అంధేరి వెస్ట్‌లో ఉన్న మూడు లగ్జరీ ఫ్లాట్లను తన తండ్రి రాకేష్ రోషన్‌తో కలిసి దాదాపు రూ.6.75 కోట్లకు విక్రయించినట్లుగా బీటౌన్ మీడియాలో గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. వీటిలో రెండు రాకేష్ రోషన్‌వి కాగా.. మరొకటి హృతిక్‌ది. అయితే ఈ తండ్రీ కొడుకులు ఈ ఆస్తులను ఎందుకు విక్రయించారు? అంత అవసరం ఏమొచ్చింది? అంటూ బాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X