ప్రెగ్నెన్సీని అలా ప్లాన్ చేసుకోవాలి.. దీపిక పదుకోన్‌పై బాలీవుడ్ నటుడు ఘాటుగా!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. గతంలో మహిళా నటులకు 8 గంటలు మాత్రమే స్ట్రిక్ట్‌గా పనిచేయాలనే రూల్ గురించి ఆమె మాట్లాడిన మాటలు భారీ చర్చకు దారి తీశాయి. అయితే పని గంటల కుదింపు వ్యవహారం వల్ల ఆమె రెండు భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులు వదులుకోవాల్సి వచ్చింది. అయితే తాను విధించిన 8 పనిగంటల వ్యవహారం మరోసారి భారీ వివాదానికి దారి తీసింది.

తాజాగా నటి సోహా ఆలీ ఖాన్‌తో కలిసి బాలీవుడ్‌లో నటుడు కునాల్ కేము ఓ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో దీపిక పదుకోన్‌ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని పరోక్షంగా చేసిన కామెంట్స్ అత్యంత వివాదాస్పదంగా మారడమే కాకుండా భారీగా ట్రోలింగ్ కారణమవుతున్నాయి. మహిళలు ప్రెగ్నెన్సీని చిన్నచూపు చూస్తారా? అంటూ నెటిజన్లు, సామాజిక కార్యకర్తలు మండిపడుతున్నారు. కునాల్ కేము చేసిన కామెంట్స్ ఏమిటంటే?

Deepika Padukone

దీపిక పదుకోన్‌కు సంబంధించి 8 పనిగంటల వివాదం సందీప్ రెడ్డి వంగా రూపొందించే స్పిరిట్ సినిమా సమయంలో తెరపైకి వచ్చింది. ప్రభాస్‌తో భారీ ప్రాజెక్ట్‌ నిర్మించే సమయంలో దీపిక పదుకోన్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని ప్లాన్ చేశారు. కానీ దీపిక మాత్రం తాను 8 గంటలకు మించి పనిచేయలేను. అలాగే తనకు సినిమా లాభాల్లో వాటా ఇవ్వాలి, అంతేకాకుండా భారీ రెమ్యునరేషన్‌తోపాటు తన సిబ్బందికి ఫైవ్ స్టార్ హోటల్ పెసిలిటీ కల్పించాలి అని డిమాండ్ చేసినట్టు వార్తలు వచ్చాయి.

దీపిక డిమాండ్లకు తలవొగ్గని సందీప్ రెడ్డి ఆమెను తప్పించి తృప్తి డిమ్రీని తీసుకోవడం తెలిసిందే. ఆ తర్వాత ప్రభాస్ నటించే కల్కి పార్ట్ 2 సినిమా నుంచి కూడా దీపిక పదుకోన్‌ను తప్పించారు. దాంతో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలను వదులుకోవడం భారీ చర్చకు దారి తీసింది. అయితే అంతటితో ఆ వివాదానికి పుల్‌స్టాప్ పడినట్టు అంతా భావించారు. కానీ ఇటీవల కునాల్ కేము చేసిన కామెంట్‌తో మరోసారి వివాదంగా మారాయి. ఇంతకు కునాల్ తన ఇంటర్వ్యూలో ఏం చెప్పారనే విషయానికి వస్తే..

Deepika Padukone

కునాల్ కేము మాట్లాడుతూ.. తక్కువ పనిగంటలు వర్క్ చేసి కూడా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం అన్యాయం. ఇలాంటి డిమాండ్లు నిర్మాతకు కష్టంగా మారుతాయి. బడ్జెట్, షెడ్యూల్స్ మేనేజ్ చేయడం చాలా కష్టమవుతుంది. నిర్ణీత పనిగంటలు, ఎక్కువ పారితోషికం డిమాండ్ చేసే వాళ్లు ఒకసారి నిర్మాతగా మారి వాళ్ల సొంత డబ్బు సినిమా ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెడితే ఆ కష్టం, నష్టం ఏమిటో తెలుస్తుంది అని ఘాటుగా స్పందించారు.

హీరోయిన్ల కెరీర్ ప్లానింగ్, సంతానం, ఫ్యామిలీ లైఫ్ గురించి తన అభిప్రాయాలను చెబుతూ.. ఒకవేళ ఎవరైనా గర్బం దాల్చితే 9 నెలలపాటు విశ్రాంతి అవసరం. కాబట్టి ఏదైనా సినిమా ప్రాజెక్ట్‌ను ఒప్పుకొన్నప్పడు ప్రెగ్నెన్సీని జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. షూటింగులు, ఇతర నటీనటుల డేట్స్‌కు ఇబ్బంది కాకుండా ప్లాన్ చేసుకోవాలి. ఎంతో మంది ఇన్వాల్వ్ అయ్యే సినిమా ప్రాజెక్ట్ ఆగిపోకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడటం లేదు. సాధారణంగా ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇలాంటి సమస్యలు మగవాళ్లకు కూడా ఎదురు కావొచ్చు అని కునాల్ కేము అన్నారు.

అయితే కునాల్ కేము చెప్పిన విషయాలు ఇండస్ట్రీ మంచిని దృష్టిలో పెట్టుకొని చేసినప్పటికీ.. అవి మాత్రం దీపిక పదుకోన్‌ను టార్గెట్ చేసి మాట్లాడారు అంటూ నెటిజన్ల ఘాటుగా స్పందిస్తున్నారు. ఆయన మాటలు మహిళలను కించపరచడమే. ఉమెన్ ప్రొఫెషనల్స్‌ను తక్కువ చేసి మాట్లాడటమే అని ఘాటుగా స్పందిస్తున్నారు. ఈ వివాదంపై కేము, దీపిక స్పందిస్తారా? లేదా అనే వేచి చూడాల్సిందే.

కునాల్ కేము కెరీర్ విషయానికి వస్తే.. జమ్ము కాశ్మీర్‌కు చెందిన ఆయన పటౌడీ కూతురు, సైఫ్ ఆలీ ఖాన్ సోదరి సోహా ఆలీ ఖాన్‌ను వివాహం చేసుకొన్నాడు. మహేష్ భట్ దర్శకత్వంలో రూపొందిన సర్ సినిమా ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించారు. రాజా హిందుస్థానీ, జక్మ్, హమ్ హై రాహీ ప్యార్ కే, దుష్మన్, కలాంక్, లూట్ కేస్, మడగావ్ ఎక్స్‌ప్రెస్ చిత్రాల్లో నటించారు. గోల్ మాల్ 5 చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X