‘బాబీ డియోల్‌తో టీనేజ్ రొమాన్స్.. ఆ హీరోయిన్ మధ్యలో దూరి..’

అలనాటి బాలీవుడ్ స్టార్ ధర్మేంద్ర వారసుడిగా ఫిలిం ఇండస్ట్రీలోకి ప్రవేశించిన బాబీ డియోల్ ఆరంభంలో వరుస హిట్లతో స్టార్ స్టేటస్ కొనసాగించాడు. అయితే విజయాల పరంపర కొనసాగించలేక కెరీర్ అర్ధాంతరంగా ముగిసే ప్రమాదాన్ని చవిచూశాడు. హీరోగా అవకాశాలు లేక మద్యానికి బానిసై దిగ్బ్రాంతికరమైన పరిస్థితుల్లో జీవితాన్ని కొనసాగించాడు. అయితే యానిమల్ సినిమాతో బాలీవుడ్‌లో తిరుగులేని ప్రతినాయకుడిగా తన కంటూ మంచి ఇమేజ్ కొనసాగించాడు. తనకు వచ్చిన ఆఫర్లను స్వీకరించి సౌత్‌లో కూడా స్టార్ విలన్‌గా పేరు సంపాదించుకొన్నాడు. అయితే యువ హీరోగా రాణిస్తున్న సమయంలో ఓ కుర్ర హీరోయిన్‌తో టీనేజ్ రొమాంటిక్ లైఫ్‌ను ఎలా కొనసాగించారనే వివరాల్లోకి వెళితే..

బాబీ డియోల్ స్టార్ హీరో‌గా కొనసాగుతున్న రోజుల్లో చాలా మంది హీరోయిన్లతో లింకులు అంటగట్టారు. అందులో ప్రముఖంగా అప్పటి టాప్ హీరోయిన్ నీలమ్ కొఠారీ, జ్యువెల్లరీ డిజైనర్ ఫరా ఖాన్ ఆలీతో అఫైర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ మాట్లాడుతూ.. తనకు, బాబీ డియోల్‌కు ఉన్న బంధం గురించి క్లారిటీ ఇచ్చారు. ఆయనతో నా రిలేషన్ బాల్య స్నేహంమే అని చెప్పారు. కానీ రూమర్ల కారణంగా నీలమ్‌తో నాకు వ్యక్తిగతమైన అభిప్రాయ బేధాలు తలెత్తాయని చెప్పారు.

Bobby Deol

బాబీ నేను చిన్ననాటి స్నేహితులం. ఈ రోజుల్లో డేటింగ్ మాదిరిగా మా బంధం ఉండేది కాదు. అతనంటే నాకు పీకల్లోతు క్రష్. ఆయనకు కూడా నేనంటే చాలా ఇష్టం. అంతకంటే మా మధ్య అందరూ అనుకొనే ఎలాంటి రిలేషన్ లేదు. తీరిక సమయాల్లో చేతిలో చేయి వేసుకొని నడిచే వాళ్లం. ఒకరికొకరం లెటర్లు రాసుకొనే వాళ్లం. ఆ సమయంలో అతడికి 17 ఏళ్లు..నాకు 16 ఏళ్లు. అంతకంటే మా మధ్య ఏమీ లేదు అని చెప్పారు.

బాబీతో తన బంధాన్ని నీలమ్ దెబ్బ తీసిందా? అనే విషయంపై ఫరా ఖాన్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. నీలమ్ నాకు మంచి స్నేహితురాలు. మా ఇద్దరం బంధంలోకి నీలమ్ వచ్చిన సంగతి కరెక్టే. కానీ ఆమె వల్ల మా స్నేహం చెడిపోలేదు. మా మధ్య బాల్యానికి సంబంధించిన మెమొరీస్ ఉన్నాయి. ఇప్పటికీ మేము క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే. నేను కొంచెం మొండిగా ఉంటాను. కానీ జీవితంలో బాధపడేంతగా నిర్ణయాలు తీసుకోలేదు అని ఆమె అన్నారు.

బాబీతో నీలమ్ అఫైర్ దాదాపు 5 ఏళ్లు కొనసాగింది. కొన్ని కారణాల వల్ల వారి మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయి. 1990 సంవత్సరంలో వారిద్దరికి బ్రేకప్ అయింది. ఆ తర్వాత తన్యాను బాబీ పెళ్లి చేసుకొన్నారు. వారికి ఇద్దరు కుమారులు, వారు ప్రస్తుతం సంతోషకరమైన జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు అని చెప్పారు. అయితే 1999లో ఫరా పెళ్లి చేసుకోగా 4 ఏళ్ల తర్వాత తన భర్త నుంచి విడాకులు తీసుకొన్నారు.

బాబీ డియోల్ కెరీర్ విషయానికి వస్తే.. యానిమల్ తర్వాత ఆయన కెరీర్ గ్రాఫ్ ఊహించని విధంగా మారిపోయింది. తెలుగులో హరిహర వీరమల్లు, డాకు మహారాజ్, తమిళంలో కంగువా, హిందీలో వార్ 2, బందర్, ఆల్ఫా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం విజయ్‌తో కలిసి జన నాయగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఫరా ఖాన్ ఇంటర్వ్యూ బాలీవుడ్‌లో భారీ చర్చకు దారి తీసింది.

Read more about: neelam bobby deol
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X