twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గర్భం దాల్చడం వల్లే హీరోయిన్ రహస్య వివాహం?

    By Bojja Kumar
    |

    Recommended Video

    Neha Dhupia Get Blamed By Her Fans

    బాలీవుడ్ బ్యూటీ నేహా ధూపియా ఇటీవల రహస్య వివాహం చేసుకుని అభిమానులకు, ప్రేక్షకులకు సడెన్ సర్‌ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన బాయ్ ఫ్రెండ్, బాలీవుడ్ నటుడు అంగద్ బేడీని ఆమె పెళ్లాడారు. ఈ విషయం తెలిసిన వెంటనే ఫ్యాన్స్ ఆమెను విష్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేయగా... కొందరు చెత్త కామెంట్లతో ఆమెను టార్గెట్ చేశారు. పెళ్లికి ముందే నేహా ధూపియా గర్భం దాల్చిందని, అందుకే ఇలా ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుందంటూ కామెంట్స్ చేశారు. ఈ ఆరోపణలపై స్పందించడానికి నేహా, అంగద్ ఇష్టపడలేదు. అయితే నేహా తండ్రి ప్రదీప్ ధూపియా స్పందించారు.

    క్లారిటీ ఇచ్చిన ప్రదీప్ ధూపియా

    క్లారిటీ ఇచ్చిన ప్రదీప్ ధూపియా

    ఈ వార్తలపై నేహా ధూపియా తండ్రి ప్రదీప్ ధూపియా స్పందిస్తూ..... అలాంటిదేమీ జరుగలేదని, పెళ్లికి ముందే నేహా గర్భం దాల్చింది అనే వార్తల్లో నిజం లేదన్నారు. కొందరు ఏదో ఊహించుకుని ఇష్టం వచ్చినట్లు రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని మండి పడ్డారు.

    అందుకే ఇలా చేయాల్సి వచ్చింది

    అందుకే ఇలా చేయాల్సి వచ్చింది

    సమయం లేక పోవడం హడావుడి లేకుండా, ఎవరికీ చెప్పకుండా కేవలం ఇరు కుటుంబాల సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగిందని ప్రదీప్ ధూపియా తెలిపారు. వారి వారి వర్క్ కమిట్మెంట్స్ వల్లనే రెండు రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి పెళ్లి తంతు ముగించామని తెలిపారు.

    వారి రిలేషన్ గురించి ఇంట్లో ముందే తెలుసు

    వారి రిలేషన్ గురించి ఇంట్లో ముందే తెలుసు

    నేహా ధూపియా, అంగద్ బేడీ రిలేషన్ గురించి కుటుంబ సభ్యులకు ముందే తెలుసట. ‘నేహా, అంగద్ గుండ్ ఫ్రెండ్స్. వారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో అని మేము ఎప్పటి నుండే వెయిట్ చేస్తున్నాం. ఎట్టకేలకు వారే స్వయంగా మా అనుమతి కోరారు. వెంటనే అంతా ఓకే చేశాం' అని ప్రదీప్ ధూపియా తెలిపారు.

    తనకంటే చిన్నవాడిని పెళ్లాడంపై విమర్శలు

    తనకంటే చిన్నవాడిని పెళ్లాడంపై విమర్శలు

    నేహా ధూపియా తనకంటే రెండేళ్లు చిన్నవాడిని పెళ్లాడటంపై కొందరు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేయడం ప్రారంభించారు. అలాంటి కామెంట్లు చేసిన వారికి నేహా తనదైన శైలిలో రిప్లై ఇవ్వడం ద్వారా వారి నోరు మూయించారు.

    English summary
    Neha Dhupia and Angad Bedi left everyone surprised when they recently got married in a low-key ceremony at a gurudwara in Delhi. While the rest of the world was busy talking about Sonam Kapoor- Anand Ahuja's hyped wedding, Neha and Angad took marital vows rather secretively and then broke the news on social media. Most of Neha's fans rejoiced over this news. But then there were some who speculated whether Neha tied the knot because she was pregnant. While Neha and Angad both refused to comment on this, Neha's father Pradip Dhupia finally addressed all these speculations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X