బయటపడిన రియా, మహేష్ వాట్సాప్ చాట్.. సుశాంత్ మరణానికి ముందే..
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై పెరుగుతున్న అనుమానాలు రోజురోజుకి మరింత బలంగా మారుతున్నాయి. సీబీఐ చేత ఇన్వెస్టిగేషన్ చేయించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి కూడా రియా చక్రవర్తిపై రోజుకో అనుమానం అంధరిని షాక్ కి గురి చేస్తోంది. ఇక సుశాంత్ మరణానికి ముందు రియా మహేష్ భట్ మధ్య జరిగిన వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్ బయటపడింది. నేషనల్ మీడియాలో ప్రస్తుతం ఆ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.
Recommended Video

రియా అతనితో సన్నిహితంగా..
నిర్మాత మహేష్ భట్ నిర్మించిన జలేబి సినిమాలో రియా చక్రవర్తి అయేషా అనే పాత్రలో నటించింది. అప్పటి నుంచి ఆమె మహేష్ భట్ కి చాలా సన్నిహితంగా ఉంటోందని కామెంట్స్ వచ్చాయి. సుశాంత్ మరణించిన తరువాత వారికి సంబంధించిన కొన్ని సీక్రెట్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో చాలానే వైరల్ అయ్యాయి. కొందరు సినీ ప్రముఖులు కూడా రియా తీరుపై అనుమానం వ్యక్తం చేశారు.

సుశాంత్ నుంచి విడిపోవడమే మంచిదని
ఇక వాట్సాప్ విషయానికి వస్తే.. జూన్ 8న వారిద్దరి మధ్య ఆ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. సుశాంత్ మరణించింది జూన్ 14న. ఇక రియా జూన్ 8న సుశాంత్ కి గుడ్ బై చెప్పేసిందని తెలుస్తోంది. అయితే అంతకుముందు నుంచే వారిద్దరి మధ్య కొన్ని గొడవలు ఉన్నట్లు మరోసారి రుజువయ్యింది. ఇక మహేష్ భట్ కూడా సుశాంత్ నుంచి విడిపోవడమే మంచిది అనే విదంగా ఆమెకు సలహా ఇచ్చినట్లు అర్ధమవుతోంది.

ఒక వేకప్ కాల్ లాంటిదని
"అయేషా(రియా) మూవ్స్ ఆన్ సార్, ఇప్పుడు చాలా హాయిగా ఉంది" ఉందని రియా మెస్సేజ్ చేస్తూ.. మీరు నాకు చేసిన ఆఖరి కాల్ ఒక వేకప్ కాల్ లాంటిదని చెప్పింది. అందుకు సమాధానం ఇచ్చిన మహేష్.. రెండు వేర్వేరు సందేశాలలో, ఇలా సమాధానం ఇచ్చాడు: "వెనక్కి తిరిగి చూడవద్దు, అనివార్యమైనదాన్ని సాధ్యం చేయండి", "మీ తండ్రికి నిపై చాలా ప్రేమ. అతను ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు." అని వివరణ ఇచ్చారు.

ఆ రోజు మీరు చెప్పిన మాటలు
అందుకు రియా.. ఆ రోజు నా తండ్రి గురించి మీరు చెప్పిన విధానం నాకు ఎంతగానో ధైర్యాన్ని ఇచ్చిందని తెలిపింది. ఈ సంభాషణలపై ప్రస్తుతం మీడియాలో అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయు. ఇప్పటికే ఫోన్ కాల్స్ పై నిఘా వేసిన పోలీసులు మహేష్ భట్, రియా మధ్య 18 కాల్స్ కొనసాగినట్లు కనుగొన్నారు. ఇక సీబీఐ రంగంలోకి దిగడంతో ముంబై పోలీసులకంటే లోతుగా ఈ కేసు విషయాన్ని మరింత లోతుగా ఇన్వెస్టిగేషన్ చేయనున్నారు.


Click it and Unblock the Notifications











