ఎయిడ్స్ గురించి మాట్లాడమంటే తెల్లముఖం వేసుకున్న స్టార్ హీరో.. ఏం జరిగిందంటే!

ఐదు పదుల వయసులో కూడా అక్షయ్ బాలీవుడ్ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా అక్షయ్ కుమార్ వేగంగా సినిమాలు చేస్తున్నాడు. ఎలాంటి పాత్ర అయినా సవాల్‌గా తీసుకుని నటించడం అక్షయ్ కుమార్‌కు అలవాటు. తాజాగా అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మైన్ కిలాడి తూ అనారి చిత్ర సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి వివరించాడు. 1994 లో విడుదలైన ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్, శిల్పా శెట్టి కలసి నటించారు.

ఢిల్లీలో ప్రీమియర్ షో

ఢిల్లీలో ప్రీమియర్ షో

మైన్ కిలాడి తూ అనారి చిత్ర విడుదల సమయంలో నిర్మాతలు ఢిల్లీలో ప్రీమియర్ షో ఏర్పాటు చేశారు. ఈ షో సందర్భంగా జరిగిన సరదా సంఘటనని అక్షయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఆ ప్రీమియర్ షో ఎందుకు నిర్వహిస్తున్నారో ముందుగా నాకు తెలియదు. అన్ని సినిమాల్లో ఈ ప్రీమియర్ షోకి కూడాహాజరయేందుకు వెళ్ళాను. వేదికపైకి నన్ను పిలిచారు. సినిమా గురించి మాట్లాడేందుకేమో అని అనుకున్నా.

ఎయిడ్స్ గురించి

ఎయిడ్స్ గురించి

వేదికపైకి వెళ్లగానే ఎయిడ్స్ గురించి మాట్లాడాలని అడిగారు. నేను ఆశ్చర్యపోయా. ఆ ప్రీమియర్ షోని ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల చారిటి కోసం నిర్వహిస్తున్నారు. నిర్మాత ముందుగా నాకు ఆ విషయం చెప్పలేదు. ఉన్నపళంగా ఎయిడ్స్ గురించి ఏం మాట్లాడాలో అర్థంకాక తెల్లముఖం వేసుకున్నా. నన్ను చూసి సైఫ్ అలీ ఖాన్ నవ్వుకుంటూ కనిపించాడు. ఈ షోకు సంబంధించిన వివరాలు నాకు తెలియవని అతడికి తెలుసు.

ఇప్పటికీ గుర్తుంది

ఇప్పటికీ గుర్తుంది

వేదికపైకి పిలిచిన తర్వాత ఏదో ఒకటి మాట్లాడి వెళ్ళాలి. ఆ సమయంలో నేను ఏం మాట్లాడానో బాగా గురుతుంది. స్నేహితులారా.. కండోమ్ ఉపయోగించండి.. ఆరోగ్యంగా ఉండండి అని చెప్పాను. నా మాటలు వినగానే సైఫ్ అలీఖాన్ నవ్వు ఆపుకోలేక కిందపడిపోయాడు. అది నా జీవితంలో జరిగిన ఓ సరదా సంఘటన అని అక్షయ్ కుమార్ తెలిపాడు.

90 దశకంలో

90 దశకంలో

అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ కాంబినేషన్ లో అనేక చిత్రాలు వచ్చాయి. ముఖ్యంగా 90వ దశకంలో వీరిద్దరి కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉండేది. వీళ్ళిద్దరూ కలసి కీమత్, ఆర్జూ లాంటి చిత్రాల్లో నటించారు. అక్షయ్ కుమార్ ప్రస్థుం హౌస్ ఫుల్ 4, మిషన్ మంగళ్, కేసరి లాంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. విభిన్నమైన కథలని ఎంచుకుంటూ అక్షయ్ కుమార్ విజయాలు సాధిస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X