తల్లిదండ్రులని కోల్పోయాను.. నా భార్య కూడా చనిపోతుందనుకున్నా.. షారుఖ్ ఖాన్!
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాను జీవితంలో ఎక్కువగా భయపడ్డ క్షణాలని గుర్తు చేసుకున్నారు. ఇటీవల జీరో చిత్రంతో షారుఖ్ అభిమానుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన జీరో చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. షారుఖ్ ఖాన్ గత కొన్నేళ్లుగా సరైన విజయాన్ని ఆదుకోలేకపోతున్నాడు. షారుఖ్ నటించిన చిత్రాలు వరుసగా పరాజయం చెందుతున్నాయి. ప్రస్తుతం షారుఖ్ భారత తొలి వ్యోమగామి రాకేష్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న బయోపిక్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఇటీవల ఇంటర్వ్యూలో తన భార్య గౌరి ఖాన్ తొలి డెలివరీ సందర్భంగా తాను ఎంత భయపడ్డానో షారుఖ్ వివరించాడు.

ఆరోగ్యం సరిగాలేదు
తన కుమారుడు ఆర్యన్ డెలివరీ సందర్భంలో గౌరి ఖాన్ ఆరోగ్యం సరిగాలేదు. గౌరి చనిపోతుందేమోనని చాలా భయపడ్డా. ఆ సమయంలో నా మదిలో ఎన్నో అనుమానాలు తలెత్తాయి. నా తల్లిదండ్రులని కూడా ఆసుపత్రిలోనే కోల్పోయా. డెలివరీ సమయంలో గౌరి ఖాన్ వణుకుతూ కనిపించింది. తన భార్య తనకు దక్కదేమోనని ఆ క్షణాల్లో ఎంతో వేదన అనుభవించానని షారుఖ్ తెలిపాడు.

ఆసుపత్రి అంటే నచ్చదు
నా తల్లిదండ్రులు ఆసుపత్రిలోనే మరణించారు.ఆ అందుకే ఆసుపత్రిలో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. కానీ ఆ రోజు గౌరి ఖాన్ కోసం ఆసుపత్రిలోనే ఉన్నా. సిజేరియన్ జరుగుతున్న సమయంలో గౌరి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. ఆ క్షణంలో గౌరి చనిపోయిందని అనుకున్నా. నేను పుట్టబోయే బిడ్డ గురించి ఏమాత్రం ఆలోచనలేదు. గౌరి గురించిన ఆందోళనే నా మనసంతా నిండిపోయింది.

కుమార్తె సుహానా
తన కుమార్తె సుహానా డెలివరీ సమయంలో అంతా సవ్యంగా జరిగిందని షారుఖ్ తెలిపాడు. నాకు కూడా ఎలాంటి ఆందోళన లేదు. షారుఖ్, గౌరి దంపతులు రెండో కుమారుడు అబ్రామ్ ఖాన్ ని సరోగసి విధానం ద్వారా పొందారు. క్యూట్ లుక్స్ తో అదరగొడుతున్న అబ్రామ్ ఫోటోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

అమ్మాయిల కోసమే
తన పెద్ద కొడుకు ఆర్యన్ ఖాన్ కి తాను ఎలా పేరు పెట్టానో షారుఖ్ సరదాగా వివరించాడు. పేరు గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. ఆర్యన్ అనే పేరులో సౌండ్ నాకు చాలా బాగా అనిపించింది. మరో ఆలోచన లేకుండా ఆ పేరు పెట్టేశా అని షారుఖ్ తెలిపాడు. ఎవరైనా అమ్మాయిలకు నా పేరు ఆర్యన్.. ఆర్యన్ ఖాన్ అని చెబితే వాళ్ళు తప్పకుండా ఇంప్రెస్ అవుతారు అంటూ షారుఖ్ సరదాగా వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











