ఆ కేసులో జైలుకెళ్లిన విక్కీ కౌశల్ .. హీరో చీకటి బాగోతం లీక్ చేసిన డైరెక్టర్
ప్రతి మనిషిలోనూ రెండు కోణాలుంటాయి. బయటికి కనిపించే వ్యక్తి ఒకరైతే ఎవ్వరికీ తెలియని కోణం మరొకటి ఉంటుంది. అది కొందరికి మాత్రమే తెలుస్తుంది. సామాన్యులే కాదు ప్రముఖులు కూడా ఇందుకు అతీతం కాదు. పబ్లిక్ ఇంట్రెస్ట్ దృష్ట్యా వారికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు ఈ విషయాలను బయటపెడుతూ బాంబు పేలుస్తారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ గురించి ఎవరికీ తెలియని విషయాలు బయటపెట్టారో దర్శకుడు. ఈ వివరాల్లోకి వెళితే..

శంభాజీ పాత్రతో దేశవ్యాప్తంగా గుర్తింపు
మహారాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆథారంగా తెరకెక్కిన ఛావాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు విక్కీ. ఈ ఒక్క సినిమాతో ఆయన రాత్రికి రాత్రికి స్టార్ హీరోగా అవతరించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఛావా చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. భారతదేశంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఛావా నిలిచింది. ముఖ్యంగా ఛత్రపతి శంభాజీ మహారాజ్‌గా విక్కీ కౌశల్ నటనకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. పతాక సన్నివేశాల్లో రక్తమోడుతున్న శరీరంతో , కళ్లు పొడిచినా, నాలుక కోసినా తలవంచని నటన ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది. థియేటర్‌లలో చిన్నారులు, పెద్దలు కంటతడి పెట్టారంటే విక్కీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ప్రొడక్షన్ బాయ్‌గా కెరీర్
16 మే, 1988న ముంబైలో జన్మించిన విక్కీ కౌశల్ తండ్రి శామ్ కౌశల్ హిందీ చిత్రాలకు యాక్షన్ డైరెక్టర్ కావడంతో సినిమా నేపథ్యం ఉంది. బీటెక్ పూర్తి చేసిన విక్కీ కౌశల్ ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగంలో చేరారు.. అయితే నటనపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదిలేసి కిశోర్ నమిత్ కపూర్, మనావ్ కౌల్, నసీరుద్దీన్ షా వంటి దిగ్గజాల దగ్గర శిక్షణ తీసుకున్నారు. ప్రొడక్షన్ బాయ్‌గా కెరీర్ ప్రారంభించిన విక్కీ .. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, సింగర్‌గా, చిన్నా చితకా పాత్రలతో వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకున్నారు .
ఉరి మూవీతో బ్రేక్
మసాన్‌తో హీరోగా అడుగుపెట్టిన ఆయన జీవితాన్ని ఉరి : ది సర్జికల్ స్టైక్ సినిమా మలుపు తిప్పింది. ఆ తర్వాత స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ ఉధంలో జీవించారు. ఇక భారతదేశ ఫస్ట్ ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానెక్‌షా జీవితం ఆధారంగా తెరకెక్కిన సామ్ బహదూర్ కోసం కంప్లీట్‌గా మేకోవర్ అయ్యారు విక్కీ. ఛావాలో శంభాజీ పాత్ర కోసం 100 కేజీలకు పైగా బరువు పెరిగిన ఆయన గుర్రపు స్వారీ, కత్తి సాము నేర్చుకున్నారు.
లోకేషన్ కోసం వెతుకుతూ చిక్కుల్లో
అయితే విక్కీ కౌశల్ జీవితంలో ఓ మాయని మచ్చలాంటి ఘటన జరిగింది. ఆయన ఓ కేసు విషయంలో అరెస్ట్ అయి జైలుకు వెళ్లినట్లు దర్శకుడు అనురాగ్ కశ్యప్ తెలిపారు. కపిల్ శర్మ షోకు హాజరైన కశ్యప్.. మాట్లాడుతూ గ్యాంగ్స్ ఆఫ్ వాస్సేపూర్ సినిమాకు విక్కీ కౌశల్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఈ సినిమా చిత్రీకరణ కోసం ఓ నేచురల్ సైట్ కోసం వెతుకుతుండగా ఓ ప్రదేశం కనిపించింది. అంతే ఎలాంటి అనుమతి లేకుండా క్రూ సిబ్బంది చిత్రీకరణ జరిపారు.
విక్కీ కౌశల్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
అయితే అక్కడ అక్రమంగా ఇసుక తవ్వకాలు, మైనింగ్ చేస్తారన్న సంగతి చిత్ర యూనిట్‌కు తెలియదట. అంతేకాదు.. ఈ దందాను మాఫియా కంట్రోల్ చేస్తుందట. ఆ ప్రాంతంలో ఎవరో సంచరిస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు క్రూ, నటీనటులను అరెస్ట్ చేశారు. ఆనాడు అరెస్ట్ అయిన వారిలో విక్కీ కౌశల్ కూడా ఉన్నారని అనురాగ్ కశ్యప్ చెప్పారు. అప్పట్లో ఈ వ్యవహారం బాలీవుడ్‌లో కలకం రేపిందని ఆయన వెల్లడించారు.


Click it and Unblock the Notifications











