Who Is Gauri Spratt: ఎవరీ గౌరీ స్ప్రాట్? .. అమీర్‌ఖాన్‌ను ఎలా పడేసిందంటే?
ఇటీవలి కాలంలో పలువురు సెలబ్రెటీలు తమ పెళ్లి, ఎఫైర్స్, బ్రేకప్స్ గురించి చెబుతూ షాకిస్తున్నారు. నిన్నగాక మొన్న తమన్నా భాటియా - విజయ్ వర్మల బ్రేకప్ వార్తలతో అభిమానులు షాక్ అయ్యారు. వీరి మధ్య దూరం పెరగడానికి, విడిపోవడానికి కారణాలు అన్వేషించే పనిలో మీడియా ఉంది. తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్ తన మూడో పెళ్లిపై గత కొంతకాలంగా వస్తున్న రూమర్స్‌కు తెరదించారు. మూడో పెళ్లి దాదాపు ఖాయమైనట్లుగా ఆయన క్లారిటీ ఇచ్చారు.
భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేసిన నటుల్లో అమీర్‌ఖాన్ కూడా ఒకరు. ఎలాంటి పాత్రలోకైనా పరకాయ ప్రవేశం చేయడమే కాదు.. అందుకోసం మేకోవర్ కావడంలో అమీర్ ఎందరికో ఆదర్శం. మూడున్నర దశాబ్ధాలుగా ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంటున్న ఈ నట దిగ్గజం.. భారత్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుడిగా, దేశంలో అత్యంత ప్రభావంతమైన వ్యక్తుల్లో ఒకరిగా నిలిచారు. భారతీయ సినీ పరిశ్రమకు అందించిన సేవలకు గాను అమీర్‌ఖాన్‌ను భారత ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది.

1986లో నటి రీనా దత్తాను పెళ్లాడిన అమీర్‌ఖాన్‌కు ఐరా ఖాన్, జునైద్ ఖాన్ సంతానం. ఆ తర్వాత వీరిద్దరి విడిపోగా.. కిరణ్ రావుతో అమీర్ ప్రేమలో పడ్డారు. ఆ జంట సరోగసి విధానంలో ఆజాద్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. కొద్దినెలల క్రితం అమీర్- కిరణ్ రావులు విడిపోవడంతో బాలీవుడ్ షాకైంది. ప్రస్తుతం ఒంటరిగా ఉంటున్న అమీర్‌ఖాన్ పలువురు అమ్మాయిలతో ప్రేమాయణం సాగిస్తున్నట్లుగా గాసిప్స్ వచ్చాయి. కొద్దిరోజుల క్రితం బెంగళూరుకు చెందిన అమ్మాయిని మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలు రావడంతో అంతా ఉలిక్కిపడ్డారు.
ఆమె ఎవరు? ఎన్నాళ్ల నుంచి అమీర్‌తో ప్రేమలో ఉంది? అంటూ మీడియా గుట్టును రట్టు చేసేందుకు ప్రయత్నించింది. అయితే అంత ఛాన్స్ ఇవ్వకుండా అమీర్ స్వయంగా ఈ విషయాన్ని బయటపెట్టారు. గురువారం తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో తాను డేటింగ్ చేస్తున్నట్లు ఆయన కుండబద్ధలు కొట్టారు. అలాగే ఇదే మీడియా సమావేశంలో ఆమెను మీడియాకు పరిచయం చేసి పుకార్లకు తెరదించారు. దీంతో గౌరీ ఎవరు? అమీర్‌తో ఆయనకు ఎలా పరిచయం ఏర్పడింది? అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది.

బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్ .. ప్రముఖ స్టైలిస్ట్ రీటా స్ప్రాట్ కుమార్తె. తొలుత ఫ్యాషన్ కోర్సును పూర్తి చేసిన గౌరీ అనంతరం లండన్ యూనివర్సిటీలో ఎఫ్‌డీఏ స్టైలింగ్ అండ్ ఫోటోగ్రఫీలో శిక్షణ పొందారు. వీరి కుటుంబానికి ముంబై, బెంగళూరులలో సెలూన్స్ ఉన్నాయి. ముంబైలోని సెలూన్‌కు ఎంతో మంది సెలబ్రెటీలు కస్టమర్లే. అమీర్‌ఖాన్ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న గౌరీ స్ప్రాట్‌కు ఆయనతో దాదాపు 25 ఏళ్ల అనుబంధం ఉంది.
బీటౌన్ మీడియా కథనాల ప్రకారం అమీర్ - గౌరీలు దాదాపు 18 నెలల నుంచి డేటింగ్‌లో ఉన్నారు. గౌరీ బెంగళూరులో ఉండటంతో తాను తరచుగా అక్కడికి వెళ్తుంటానని అందుకే ఇన్నాళ్లు తమ బంధం గురించి బయటికి తెలియలేదని అమీర్‌ఖాన్ వెల్లడించారు. దీంతో వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు? పెళ్లి ఇండియాలో ఉంటుందా? ఫారిన్‌లో ఉంటుందా అంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











