Tiger 3 Towel Fight ‘కత్రినాతో అలాంటి ఛాలెంజ్.. టవల్ ఎప్పుడు జారిపోతుందో అనే భయం’

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రం దీపావళీ కానుకగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా ఈ సినిమాను ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించారు. ఈ సినిమాకు మనీష్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్‌తోపాటు కత్రినా కైఫ్, హాలీవుడ్ నటి మిచెల్లీ లీ, దక్షిణాది నటి రేవతి నటిస్తున్నారు. షారుక్ ఖాన్ అతిథి పాత్రలో మెరవడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమా నవంబర్ 12వ తేదీన రిలీజ్ అవతున్నది. ఈ సినిమా గురించి హాలీవుడ్ నటి మిచెల్లీ లీ మాట్లాడుతూ...

సల్మాన్ ఖాన్ నటించిన టైగర్ 3 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇటీవల రిలీజై అభిమానుల ప్రశంసలు అందుకొన్నది. ఈ చిత్రంలో రొమాన్స్, యాక్షన్ సీన్లు హైలెట్‌గా నిలిచాయి. ముఖ్యంగా కత్రినా కైఫ్, మిచెల్లీ లీ కోసం డిజైన్ చేసిన టవల్ ఫైట్ సీన్ అందర్నీ విశేషంగా ఆకట్టుకొంటున్నది.

Who is Michelle Lee? Who fight with Towel against Katrina Kaif in Salman Khans Tiger 3

టైగర్ 3 సినిమాలో కత్రినా కైఫ్‌తో టవల్ ఫైట్ సీన్ గురించి చెప్పినప్పుడు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. కానీ ఎలా డిజైన్ చేస్తారో అనే ఆసక్తి నాలో కలిగింది. టవల్ ఫైట్ సీన్ కోసం దాదాపు 2 వారాలు ప్రాక్టీస్ చేశాం. అయితే షూటింగ్ చేస్తున్న సమయంలో భలే మజా అనిపించింది. ఫైట్ చేశామే కానీ ఫుల్ ఫన్ లభించింది. టవల్ ఫైట్ సీన్‌పై ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకొంటారనే విషయం గురించి ఎదురు చూస్తున్నాను అని మిచెల్లి లీ చెప్పింది.

టవల్ ఫైట్ సీన్‌లో కత్రినా కైఫ్ చాలా అందంగా కనిపించింది. ఈ యాక్షన్ సీన్‌లో ప్రొఫెషనల్‌గా వ్యవహరించిన తీరు నన్ను విపరీతంగా ఆకట్టుకొన్నది. ఫైట్ సీన్ల కోసం కత్రినా చాలా కష్టపడింది. మూమెంట్స్ ప్రాక్టీస్ చేస్తూ తెర మీద అద్బుతంగా కనిపించాలనే ప్రయత్నం నాకు స్పూర్తిగా నిలిచింది. ఆమెతో కలిసి పనిచేయడం హ్యాపీగా ఉంది అని మిచెల్లీ లీ చెప్పింది.

Who is Michelle Lee? Who fight with Towel against Katrina Kaif in Salman Khans Tiger 3

కత్రినాతో కలిసి చేసిన టవల్ ఫైట్ గురించి మిచెల్లీ లీ వివరిస్తూ.. ఆ యాక్షన్ సీన్ చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. టవల్ చుట్టుకొని.. ఒకరినిమరోకరం లాగేసుకోవడం కష్టంగా అనిపించింది. ఎప్పుడు చేతిలో నుంచి జారి పోతుందనే భయం వెంటాడింది. దాంతో రెండు రకాలుగా ఆలోచించాల్సి వచ్చింది. కానీ ఆ ఫైట్‌ను కొరియోగ్రఫి చేసిన విధానానికి హ్యాట్సాఫ్. తప్పకుండా మీకు థ్రిల్లింగ్‌గా ఉంటుంది అని మెచెల్లీ లీ చెప్పింది.

మిచెల్లీ లీ కెరీర్ విషయానికి వస్తే.. హాలీవుడ్‌లో భారీ చిత్రాల్లోను, అలాగే అగ్ర హీరోలు, హీరోయిన్లతో నటించింది. స్కార్లెంట్ జాన్సన్ నటించిన బ్లాక్ విడో, జాన్ డెప్ నటించిన పైరేట్స్ ఆఫ్ ది కరిబియన్, బ్రాడ్ పిట్ నటించిన బుల్లెట్ ట్రైన్, టామ్ హార్డీ నటించిన వెనోమ్ సినిమాల్లో నటించారు. టైగర్ 3 టవల్ ఫైట్‌లో నటించి భారతీయ ప్రేక్షకులకు చేరువయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X