హృతిక్ రోషన్ డేటింగ్ లో ఉన్నది సబా ఆజాద్ తోనే.. ఆమె ఎవరో తెలుసా?
బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ఇటీవల ముంబైలోని ఓ రెస్టారెంట్ బయట కనిపించాడు. ఈ సమయంలో, ఒక మాస్క్ వేసుకున్న అమ్మాయి చేతిని ఆయన పట్టుకున్నారు. మాస్క్ సహా జుట్టుతో ఆమె ముఖాన్ని పూర్తిగా కవర్ చేసి ఉండడంతో ఆమె ఎవరో గుర్తించలేకపోయారు. వారిద్దరూ కలిసి ఉన్న అనేక ఫోటోలు, వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది మరియు ఈ అమ్మాయి ఎవరు అని అభిమానుల మదిలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. అయితే ఆమె సభా ఆజాద్ అని అంటున్నారు. ఇంతకీ ఆ సభా ఆజాద్ ఎవరు? ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే

ఆమె ఎవరు?
ఈ రోజుల్లో హృతిక్ రోషన్ వెంట ఉన్న మిస్టరీ గర్ల్ గురించి సర్వత్రా చర్చ జరుగుతోంది. గత శుక్రవారం, బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ ఒక మిస్టరీ గర్ల్‌తో చేతులు పట్టుకుని కెమెరాల కంటికి కనిపించాడు. అప్పటి నుంచి, హృతిక్ రోషన్ ఆమెతో డేటింగ్ లో ఉండనే చారఃకే జరుగుతోంది. అయితే ఈ ఫోటోలు వైరల్ అయిన తర్వాత, ఆ మిస్టరీ గర్ల్ మరెవరో కాదని సబా ఆజాద్ అని తెలిసింది. అసలు ఆమె ఎవరు అనే విషయం మీద అందరూ వెతుకుతున్నారు.

సహజీవనం చేస్తున్నామని
ఢిల్లీలో పెరిగిన సబా పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత థియేటర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్ ను ప్రారంభించింది. శిక్షణ తీసుకున్న తర్వాత, ఆమె 2010లో తన స్వంత థియేటర్ కంపెనీని ప్రారంభించారు, దానికి 'ది స్కిన్స్' అనే పేరు పెట్టారు. అందులోనే 'లవ్‌పుక్' పేరుతో నాటకానికి దర్శకత్వం వహించారు. సబా ఆజాద్ నసురుద్దీన్ షా కుమారుడు ఇమాద్ షాతో కలిసి 'మ్యాడ్‌బాయ్ / మింక్' అనే ఎలక్ట్రానిక్ బ్యాండ్‌ను కూడా ప్రారంభించారు. 2013లో, దేశవ్యాప్తంగా అనేక ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత, ఇమాద్ షా సబాతో లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, కొన్నాళ్లుగా సహజీవనం చేస్తున్నామని చెప్పారు.

'దిల్ కబడ్డీ' సినిమాతో
సబా 'నౌతంకీ సాలా', 'డిటెక్టివ్ బ్యోమ్‌కాష్ బక్షి', 'షాందార్', 'కారవాన్' మరియు 'మర్ద్ కో దర్ద్ నహీ హోతా' వంటి చిత్రాలలో పాటలు కూడా పాడారు, ఇప్పటికి కూడా ఇవి అనేక సంగీత యాప్స్ లో అందుబాటులో ఉంటాయి. అలాగే సబా ఆజాద్ 2008లో 'దిల్ కబడ్డీ' సినిమాతో తెరంగేట్రం చేసింది. ఇందులో ఆమె రాహుల్ బోస్‌తో కలిసి ఆమె కనిపించింది. కానీ 2011లో వచ్చిన 'ముజ్సే ఫ్రెండ్‌షిప్ కరోగే' సినిమాతో ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. 2013లో, యష్ రాజ్ ఫిల్మ్ టాలెంట్ డివిజన్ 'ధూమ్ ఆంథమ్' వీడియోను తన యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది, ఇందులో సబా ఆజాద్ ఉన్నారు.

ఫిబ్రవరి 4 న విడుదల
సబా ఆజా సినిమాల్లోకి రాకముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసింది. ఇషాన్ నాయర్ దర్శకత్వం వహించిన స్టార్ట్ ఫిలిమ్స్ లో ఒకటి 'గురు' కూడా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. సబా అనేక వెబ్ సిరీస్‌లలో కూడా ప నిచేసింది. అందులో 'ఫీల్స్ లైక్ ఇష్క్' మరియు 'లేడీస్ రూమ్స్' ప్రముఖమైనవి. ఇక ఆమె సోనీ లివ్‌లో విడుదల కావాల్సిన వెబ్ సిరీస్ 'రాకెట్ బాయ్స్'లో కనిపిస్తుంది, ఇది ఫిబ్రవరి 4 న విడుదల అవుతుంది.
Recommended Video

రిలేషన్ లో ఉన్నారా? లేదా?
అయితే 2014లో సుస్సానే ఖాన్‌తో విడాకులు తీసుకున్న హృతిక్ రోషన్ తన జీవితంలో ముందుకు సాగుతున్నాడా? లేక ఇద్దరూ మంచి స్నేహితులా? అనేది తెలియాల్సి ఉంది. నిజానికి నసీరుద్దీన్ షా కుమారుడు ఇమాద్ షా సబాతో లివింగ్ రిలేషన్ లో ఉన్నానని ప్రకటించారు కానీ వారి బ్రేకప్ గురించి ఎలాంటి సమాచారం లేదు. మరి దీని మీద వారు స్వయంగా నోరు విప్పితే కానీ ఏమీ క్లారిటీ వచ్చేలా కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











