సీక్రెట్‌గా ధర్మేంద్ర అంత్యక్రియలు? హేమామాలిని బాధతో చెప్పిన కారణాలు ఏమిటంటే?
బాలీవుడ్ హీమ్యాన్, సూపర్ స్టార్ ధర్మేంద్ర తన 89 ఏట నవంబర్ 24వ తేదీన కన్నుమూసిన సంగతి తెలిసిందే. తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని బీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరిన ఆయనను తమ నివాసానికి తరలించి అక్కడే చికిత్సను అందించారు. అయితే మెరుగైన చికిత్సను పొందుతూ ఆయన మరణించగా నవంబర్ 25వ తేదీన అంత్యక్రియలు నిర్వహించారు.
అయితే ఆయన దహన సంస్కారాలు అత్యంత గోప్యంగా, సీక్రెట్‌గా, అభిమానులు లేకుండానే అతి కొద్ది మంది సినీ తారలు అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, ఆమీర్ ఖాన్, సలీమ్ ఖాన్, షారుక్ ఖాన్ తదితరులు హాజరు కాగా నిర్వహించారు. అభిమానులకు చివరిచూపు కూడా దక్కకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే బాలీవుడ్‌కు చెందిన ఫిల్మ్ మేకర్ హమద్ అల్ రెయామీ చెప్పిన విషయాలు ఏమిటంటే?

ధర్మేంద్ర అంటే ప్రపంచానికి గొప్ప ఆకర్షణ, డేరింగ్ నటుడు. అలాంటి వ్యక్తికి చివరి రోజుల్లో మాట పడిపోయింది. కదలడం చాలా కష్టమైంది. మానసికంగా చాలా ఒత్తిడికి, నొప్పికి గురయ్యాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనను అభిమానులు చూసి తట్టుకోవడం కష్టం. ఎప్పుడూ బలంగా, అందంగా కనిపించే వ్యక్తి అత్యంత బలహీనంగా కనిపించడం ఇష్టపడలేదని హేమ మాలిని చెప్పింది అని ఆయన అన్నారు.
ధర్మేంద్ర అంత్యక్రియలకు సామాన్య ప్రజలను, అభిమానులను అనుమతించకపోవడంపై కుటుంబ సభ్యులకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. ఆయన పార్ధీవ దేహాన్ని చూసిన తర్వాత అతడి గురించి తెలిసిన వారు, తెలియని వారు ఏదేదో రాసేస్తారు. ఆయన చరిష్మాకు పాపులారిటీకి భంగం కలిగించేలా రాయడానికి అవకాశం ఉంది. ధర్మేంద్ర తన జీవిత కాలంలో తాను బలహీనంగా, అనారోగ్యంగా కనిపించడానికి ఇష్టపడలేదు. ప్రజల మదిలో హీరో రూపమే ఉండాలని కోరుకొన్నారు. అందుకే ఆయనను అభిమానుల చివరిచూపుకు అంగీకరించలేదని హేమ మాలిని తన అభిప్రాయలను పంచుకొన్నారని హమద్ పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











