Ban Maharaj అమీర్ ఖాన్ కొడుకు బాలీవుడ్ ఎంట్రీ మూవీకి ఎదురు దెబ్బ.. బ్యాన్ ఎందుకంటే?

విజయ్ సేతుపతి హీరోగా నటించిన మహారాజ జూన్ 14న థియేటర్లలోకి రానుంది. జర్నలిస్టులు, విమర్శకులు సినిమాకు పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన మహారాజా ద్వితీయార్థంలో అనేక మలుపులు ఉంటాయి. మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రానున్న మహరాజ్ సినిమాపై నిషేధం విధించాలంటూ సోషల్ మీడియాలో వివాదం చెలరేగింది. మరి ఆ వివాదం ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

మహరాజ్ అనగానే విజయ్ సేతుపతి మూవీనే గుర్తొస్తుంది సౌత్ మూవీ లవర్స్ కి. కానీ ట్విస్ట్ ఏంటంటే.. రేపు తమిళంలో విడుదలవుతున్న విజయ్ సేతుపతి నటించిన మహారాజా సినిమాను నిషేధించాలంటూ ఈ నిరసన జరగడం లేదు. అమీర్ ఖాన్ తనయుడు నటించిన ఓటీటీ చిత్రం మహారాజ్‌ను బ్యాన్ చేయాలంటూ బాలీవుడ్‌లో పెద్ద నిరసన వెల్లువెత్తింది. గతంలో అమీర్ ఖాన్ నటించిన పలు సినిమాలపై కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. కానీ మహరాజ్ మూవీ మాత్రం అసలు విడుదల అవుతుందా అన్నట్టుగా ఉంది పరిస్థితి.

Why Hindu organisations demand ban on Aamir Khan s Son Junaid Khan film Maharaj

బాలీవుడ్ ఖాన్ల త్రయంలో ఒకరైన స్టార్ అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఆయన హీరోగా తెరకెక్కిన మహారాజ్ చిత్రం జూన్ 14న ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ లో విడుదలవుతోంది. జునైద్ ఖాన్ అమీర్ ఖాన్ మాజీ భార్య రీనా దత్తాకు జన్మించాడు. ప్రస్తుతం బాలీవుడ్‌లో నటుడిగా కొనసాగుతున్నాడు. ఆయన నటించిన సినిమా రేపు నేరుగా ఓటీటీలో విడుదల కానుంది.

అయితే మహారాజ్ చిత్రం హిందూ మతాన్ని కించపరిచేలా ఉందని, హిందూ మత గురువులను కించపరిచే లక్ష్యంతో ఈ మూవీని తీస్తున్నారని ఉత్తరాదిలోని హిందూ సంస్థలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ సినిమా కథ యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. 1862లో జరిగిన మహారాజా పరువు నష్టం కేసునే సినిమాగా తీశారు. సెయింట్ జాదునాథ్‌జీ బ్రిజరత్తంజీ మహారాజ్ కార్యకలాపాలను బట్టబయలు చేసిన జర్నలిస్టు కర్షందాస్ ముల్జీ కథే ఈ మహారాజ్ సినిమా కథ అని చెబుతున్నారు.

Why Hindu organisations demand ban on Aamir Khan s Son Junaid Khan film Maharaj

పీకేలో తండ్రి అమీర్ ఖాన్ హిందూ దేవుళ్లను అవమానించాడని, ఇప్పుడు కొడుకు కూడా అదే పనికి దిగాడని ఫైర్ అవుతున్నారు. ముస్లిం సాధువులపై ఎందుకు సినిమాలు తీయరు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మహారాజ్ చిత్రాన్ని విడుదల చేయక ముందే బ్యాన్ చేయాలని హిందూ సంస్థలు పోరాడుతున్నాయి. నిజానికి ఈ సినిమా పోస్టర్ తోనే వివాదం మొదలైంది. మరి అమీర్ ఖాన్ కొడుకు ఈ అడ్డంకులు అన్నీ దాటుకొని తన ఫస్ట్ మూవీ మూవీతో ప్రశంసలు అందుకుంటాడా ? లేకపోతే వివాదం కారణంగా నెట్‌ఫ్లిక్స్ ఈ మూవీ స్ట్రీమింగ్ ను ఆపేస్తుందా ? అనేది చూడాలి.

గతంలో నయనతార అన్నపూర్ణి మూవీకి కూడా ఇదే పరిస్థితి వచ్చింది. నయన్ హీరోయిన్‌గా నీలేష్ కృష్ణ దర్శకత్వం వహించిన అన్నపూర్ణి సినిమా కూడా హిందువులను అవమానించేలా ఉందనే తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. నెట్‌ఫ్లిక్స్ నుండి ఆ మూవీని తొలగించారు. తాజాగా మహరాజ్ మూవీ కూడా వివాదంలో కూరుకుపోతున్నది. ఈ సినిమా విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X