Raj Kundra arrest పోర్న్ రాకెట్‌లో శిల్పాశెట్టి చురుకైన పాత్ర?.. ముంబై పోలీసుల క్లారిటీ
బాలీవుడ్ పోర్న్ రాకెట్ కేసులో హీరోయిన్ శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా అరెస్ట్‌తో సినీ వర్గాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. దాంతో పోర్నోగ్రాఫిక్ కంటెంట్ క్రియేషన్ విషయంలో ప్రస్తుతం శిల్పాశెట్టి పాత్ర ఎంత వరకు ఉందనే విషయంపై ముంబై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం ముంబై పోలీసులు నిర్వహించిన మీడియా సమావేశంలో ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరాంబే మాట్లాడుతూ...

లోతైన దర్యాప్తు చేస్తున్నాం
శిల్పాశెట్టి భర్త, బిజినెస్‌మ్యాన్ రాజ్ కుంద్రా అశ్లీల చిత్రాలను నిర్మించి వాటిని పలు యాప్స్‌లో అప్‌లోడ్ చేస్తున్నారనే విషయం మా దృష్టికి వచ్చింది. ఈ విషయంలో సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ లోతైన విచారణ చేస్తున్నది. బాధితులు ఎవరైనా ఉంటే ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరుతున్నాం అని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ భరాంబే తెలిపారు.

శిల్పాశెట్టి రోల్ గురించి
బాలీవుడ్ పోర్న్ రాకెట్ కేసులో శిల్పాశెట్టి చురకైనా పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటి వరకు ఆమె పాత్ర ఉన్నట్టు ఎక్కడా ఆధారాలు లభించలేదు. ఈ పోర్న్ రాకెట్ కేసులో ఏదైనా పాత్ర ఉందా అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నాం. ఆమెనే కాకుండా, ఇంకా ఎవరిపైనా అలాంటి ఆధారాలు ఏదైనా లభిస్తే నిందితులను కఠినంగా శిక్షిస్తాం. బాధితులు ఎవరైనా ఉంటే ముంబై క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేయండి అని మిలింద్ సూచించారు.

12 అరెస్టులు జరిగాయంటూ
బాలీవుడ్‌లో పోర్న్ రాకెట్ కేసును మాల్వానీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా క్రైమ్ బ్రాంచ్, సీఐడీ, ప్రాపర్టీ సెల్ కూడా దర్యాప్తులో భాగమయ్యాయి. ఇప్పటి వరకు రాజ్ కుంద్రాతోపాటు 12 అరెస్టులు జరిగాయి. ఈ కేసులో రాజ్ కుంద్రా కోసం పనిచేస్తున్న సాంకేతిక నిపుణుడు ర్యాన్ జే థాప్రేను కూడా అరెస్ట్ చేశాం. వారిని ముంబై మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టాం. వారికి కోర్టు జూలై 23వ తేదీ వరకు పోలీస్ రిమాండ్‌కు కోర్టు అప్పగించింది అని జాయింట్ పోలీస్ కమిషనర్ మిలింద్ తెలిపారు.

తొమ్మిది మందిని అరెస్ట్ చేశాం
బాలీవుడ్ పోర్న్ రాకెట్ వ్యవహారానికి సంబంధించి 2021 ఫిబ్రవరిలో తొలి ఫిర్యాదు అందింది. వెబ్ సిరీస్, షార్ట్ ఫిలింస్ కోసం ఆఫర్లు ఎరవేస్తూ పోర్నోగ్రాఫిక్ కంటెంట్‌ను క్రియేట్ చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. వాటి ఆధారంగా గతంలో టీవీ నటి గెహ్నా విశిష్ట్, యాస్మిన్ ఆర్ ఖాన్, మోను జోషి, ప్రతిభా నలవాడే, ఎం ఆతీప్ ఆహ్మాద్, దిపాంకర్ పీ ఖాస్నావిస్, భానుసూర్య థాకూర్, తన్వీర్ హష్మీ, ఉమేశ్ కామత్‌ను అరెస్ట్ చేశాం అని మిలింద్ భరాంబే తెలిపారు.
Recommended Video


రాజ్ కుంద్రాపై నమోదైన కేసులు
బాలీవుడ్ పోర్న్ రాకెట్ కేసులో రాజ్ కుంద్రాను అరెస్ట్ చేశాం. ఐటీ యాక్ట్, ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ (ప్రొబేషన్) చట్టం 2000 ప్రకారం ఐపీసీ 292, 67, 67ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశాం. ఈ కేసులో అరెస్ట్ అయిన వారందరినీ విచారిస్తున్నాం. ఈ కేసులో లోతైనా దర్యాప్తు చేస్తున్నాం అని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ చెప్పారు.


Click it and Unblock the Notifications











