దీపికతో రణ్‌బీర్ బ్రేకప్ గుట్టువిప్పిన తల్లి.. రిలేషన్‌షిప్ అందుకే ఫెయిల్ అంటూ నీతా
యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్న యువ హీరో రణ్‌బీర్ కపూర్ లైఫ్‌లో రకరకాల అఫైర్లు, బ్రేకప్స్ ఉన్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో యువ హీరోయిన్లందరితో లింకులు పెడుతూ అఫైర్ వార్తలు వినిపించేవి. అయితే చివరకు రకరకాల బ్రేకప్ రూమర్ల తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్‌తో ప్రేమ వివాహం ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచి ఆయన పర్సనల్ లైఫ్‌లో ఎలాంటి రూమర్లు వినిపించడం లేదు. అయితే గతంలో వినిపించిన రూమర్ల గురించి రణ్ బీర్ తల్లి నీతా సింగ్ కపూర్ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..
రణ్‌బీర్ కపూర్ లైఫ్‌లో దీపిక పదుకోన్, వికీ కౌశల్‌తో ప్రధానంగా అఫైర్, డేటింగ్ రూమర్లు ఎక్కువగా వినిపించాయి. అయితే వారిద్దరితోనే కాకుండా అమీషా పటేల్, నర్గీస్ ఫక్రీ, ప్రియాంక చోప్రా, సోనమ్ కపూర్, నందితా మహాతాని లాంటి హీరోయిన్లతో కూడా అఫైర్ వార్తలు వినిపించాయి. తన తొలి చిత్రం సావరియా సమయంలో సోనమ్ కపూర్, ఆ తర్వాత అంజానా అంజానీ సినిమా సమయంలో ప్రియాంక చోప్రాతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు మీడియాలో షికారు చూశాయి.

ఆ తర్వాత రాక్‌స్టార్ సినిమాలో కలిసి నటించిన సమయంలో నర్గీస్ ఫక్రీతో రణ్‌బీర్ ప్రేమ వ్యవహారం ఘాటుగానే కొనసాగిందని చెప్పుకొంటారు. ఇక తూ ఝూటీ మై మక్కర్ సినిమా సమయంలో అమీషా పటేల్‌తో డేటింగ్ రూమర్లు వ్యాపించాయి. తన ఇంట్లో జరిగిన పార్టీకి అమీషా రావడంతో వారి మధ్య ఘాటుగా రొమాన్స్ జరుగుతుందని మీడియాలో వార్తలు ఘాటుగా ప్రచారం అయ్యాయి.
అయితే రణ్‌బీర్ కపూర్ లైఫ్‌లో చాలా మందితో అఫైర్ వార్తలు వినిపించినప్పటికీ.. ప్రధానంగా పెళ్లి వరకు వచ్చిన రూమర్లు మాత్రం దీపిక పదుకోన్, కత్రినా కైఫ్‌తో మాత్రమే. దీపికతో అఫైర్ దాదాపు పెళ్లి వరకు వచ్చింది. చివరి నిమిషంలో వారిద్దరి విడిపోవడం జరిగింది. ఆ తర్వాత దీపిక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైంది. ఆ తర్వాత కత్రినా కైఫ్‌ది కూడా అదే పరిస్థితి. వారిద్దరూ ప్రైవేట్ వెకేషన్స్ వెళ్లి మీడియాకు దొరికారు. అయితే వీరిద్దరు కూడా వివాహం చేసుకొంటారని అనుకొన్నారు. కానీ మధ్యలోనే బ్రేకప్ అయింది.
అయితే తన కుమారుడు రణ్‌బీర్ కపూర్ అఫైర్ల గురించి తల్లి నీతూ సింగ్ కపూర్ క్లారిటీ ఇచ్చారు. నా కొడుకుకు చాలా మంది అమ్మాయిలతో సంబంధాలు లేవు. నాకు తెలిసి ఒకే ఒక గర్ల్‌ఫ్రెండ్ దీపిక పదుకోన్ మాత్రమే. వారిద్దరి రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గానే కొనసాగింది. కానీ వారిద్దరి మధ్య ఏదో విషయం లోపించింది. అది వారి బంధాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయింది. అందుకే బ్రేకప్ జరిగింది అని ఆమె చెప్పారు.
రణ్‌బీర్ రిలేషన్ షిప్ పర్‌ఫెక్ట్‌గా ఉంటే.. బ్రేకప్ జరిగేది కాదు. అయితే దీపికతో నా కొడుకు రిలేషన్ షిప్‌లో లేకపోవడం వల్ల వారి బంధం ముందుకు వెళ్లలేదు అని నీతూ అన్నారు. ఇదిలా ఉంటే.. దీపిక, కత్రినా కైఫ్‌తో బ్రేకప్ తర్వాత ఆలియా భట్‌తో రణ్‌బీర్ ప్రేమలో పడటం.. ఆ తర్వాత వారిద్దరూ పెళ్లి చేసుకోవడం జరిగింది. దీపిక పదుకోన్, రణ్‌వీర్ సింగ్, కత్రినా, వికీ కౌశల్ లవ్ మ్యారేజ్ చేసుకొని హాయిగా కాపురం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











