బాలీవుడ్‌ హీరోయిన్‌తో రతన్ టాటా అఫైర్.. బ్రహ్మచారిగా మిగిలిపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

భారతదేశం గర్వించదగిన పారిశ్రామిక వేత్త, లెజెండరీ రతన్ టాటా ఇకలేరనే వార్త దేశవ్యాప్తంగా దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన మరణవార్తతో ప్రతీ ఒక్కరు విషాదంలో మునిగిపోయారు. అయితే దేశ పారిశ్రామిక పురోగతికి మార్గదర్శకంగా నిలిచిన ఆయన ఎంతో మందికి స్పూర్తి నిచ్చారు. అలాంటి గొప్ప మేధావి అయిన రతన్ చివరి వరకు బ్రహ్మచారిగా ఉండిపోయారు. అందుకు కారణం ఆయన జీవితంలో జరిగిన లవ్ బ్రేకప్స్ కారణమని చెప్పుకొంటారు. ఆయన వ్యక్తిగత జీవితం విషయంలోకి వెళితే..

రతన్ టాటా విద్యార్థి దశలో విదేశాల్లో చదువుకొన్నారు. ఆ సమయంలో ఓ యువతితో ప్రేమలో పడిపోయాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో ఆఫైర్ కొనసాగించారు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకొన్న సమయంలో తన తల్లి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇండియాకు తిరిగి వచ్చారు. అయితే ఆ సమయంలో దేశంలోనే ఉండిపోవడంతో ఆయన అఫైర్‌కు బ్రేక్ పడింది.

Why Ratan Tata love affair broke up with Simi Garewal Here is fact and Reasons behind relationship

కుటుంబ వ్యాపారంలో రతన్ టాటా బిజీగా మారిపోవడంతో ఆ తర్వాత మళ్లీ చాలా కాలం వరకు పెళ్లి, ప్రేమ గురించి ఆలోచించలేకపోయారు. ఆయన వ్యాపారంలో మునిగిపోవడంతో మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చినా ఆయన దూరంగానే ఉన్నారు. అయితే ఆయన రొమాంటిక్ లైఫ్, డేటింగ్ వ్యవహారాలు మీడియాలో అప్పుడప్పుడు వినిపించాయి.

అలా రతన్ టాటా ప్రేమయాణం గురించి బాలీవుడ్ మీడియాలో పలు కథనాలు వినిపించాయి. అందులో ప్రముఖంగా వినిపించిన పేరు హీరోయిన్ సిమీ గరేవాల్. టీవీ, నటిగా పేరు తెచ్చుకొన్న సిమితో ఆయన ప్రేమాయణం జరిగిందనే విషయం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే వారిద్దరి సహజీవనం మాత్రం పెళ్లి పీటల వరకు రాలేకపోయింది.

Why Ratan Tata love affair broke up with Simi Garewal Here is fact and Reasons behind relationship

అయితే రతన్ టాటాతో తన అఫైర్ గురించి సిమి గరేవాల్ స్వయంగా ఓ టీవీ షోలో వెల్లడించింది. రతన్ టాటా ఫర్‌ఫెక్షనిస్ట్, ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఆయన పర్‌ఫెక్ట్ జెంటిల్మన్. ఆయన ఎప్పుడు డబ్బు వెనుక పడలేదు. దాని కోసం వెంపర్లాడలేదు. ఆయనతో నా ప్రయాణం సుదీర్ఘంగా సాగింది అని చెప్పారు.

దేశానికి ఎంతో సేవలు చేసిన రతన్ టాటా తన 86వ ఏట తుదిశ్వా స విడిచారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ అక్టోబర్ 9వ తేదీన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతికి బాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. అమితాబ్ నుంచి అమీర్ ఖాన్, ఇతర సినీ ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు.

More from Filmibeat

Read more about: ratan tata simi garewal bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X