రక్తం మడుగులో సైఫ్ ఆలీ ఖాన్.. కారులో కాకుండా ఆటోలో హాస్పిటల్‌కు.. అసలేం జరిగిందంటే?

బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ ఇంట్లో దొంగతనానికి వచ్చిన అగంతకుడు దాడి చేసిన ఘటనలో అనేక ఆసక్తికరమైన, అనుమానకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అమానుష దాడి తర్వాత వెలుగులోకి వస్తున్న ప్రతీ విషయంలో మిస్టరీ దాగి ఉన్నట్టు కనిపిస్తున్నది. అయితే దొంగ దాడిలో గాయపడి రక్తం మడుగులో పడి ఉన్న సైఫ్‌ను ఆటోలో హాస్పిటల్‌కు తరలించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయం అసలు ఏం జరిగిందటే?

వేల కోట్ల సంపదతో చోటా నవాబ్
సైఫ్ ఖాన్ అంటే పటౌడీకి వంశానికి చెందిన చోటా నవాబు. వేల కోట్ల ఆస్తులు వారికి వారసత్వంగా సంక్రమించాయి. ఇంట్లో లెక్కలేనంత సంపద, కార్లు, వ్యక్తిగత సిబ్బంది ఉండటమనేది సహజమే. అయితే దేవర విలన్‌పై దాడి జరిగిన తర్వాత మంది మార్బాలం కనిపించలేదు. సాధారణ పౌరుడి మాదిరిగా ఆటోలో హాస్పిటల్‌కు తరలించారని ప్రముఖ జాతీయ పత్రిక న్యూస్ 18 తన కథనంలో పేర్కొన్నది.

Why Saif Ali Khan shifted Lilavati Hospital in Auto instead of Car after Stabbing incident is there any Conspiracy

హై సెక్యూరిటీ ఇంట్లోకి దొంగ?
అత్యంత పకడ్బందీగా సెక్యూరిటీ ఉండే ఇంట్లోకి దొంగ ప్రవేశించడమనేది ఆశ్చర్యకరమైన విషయం. ఏకంగా ఆయన కుమారుడు జేష్ గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే.. సిబ్బంది ఏం చేస్తున్నారు? ఇంట్లోకి వచ్చి హంగామా చేస్తుంటే.. సెక్యూరిటీ ఏమైపోయారు? సైఫ్‌ శరీరంలో కత్తిపోట్లు పడుతుంటే.. పని మనుషులు ఏం చేశారు అనే ప్రశ్నలు ఇప్పుడు సాధారణ పౌరులను కూడా ఆలోచింప జేస్తున్నాయి.

భారీగా నగదు డిమాండ్
అయితే అగంతకుడు ఇంట్లోకి జొరబడి భారీగా నగదు డిమాండ్ చేయడం లేకపోతే చంపేస్తానని బెదిరించడంతో సైఫ్.. దొంగను మేనేజ్ చేస్తూ.. తన కుటుంబాన్ని సేఫ్ ప్లేస్‌కు తరలించే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో వెనుక నుంచి చొరబాటుదారుడు సైఫ్ వెన్నుముక ప్రాంతంలో కత్తిపోట్లు దించాడు. దాంతో ఆయన గాయాల నుంచి తీవ్ర రక్తస్రావం జరిగింది అని వ్యక్తిగత సిబ్బంది మీడియాకు వెల్లడించారు.

Why Saif Ali Khan shifted Lilavati Hospital in Auto instead of Car after Stabbing incident is there any Conspiracy

ఆటోలో హాస్పిటల్‌కు
అయితే విపరీతంగా రక్తం కారుతుంటే.. కారు కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. అయితే కారు డ్రైవర్ అందుబాటులో లేకపోవడం, కారులో తీసుకెళ్లడానికి వీలు కాకపోవడంతో సైఫ్‌ను ఆటోలో హాస్పిటల్‌కు తరలించారు. తన నివాసానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న లీలావతికి హుటాహుటిన తరలించారు. అయితే కారు, డ్రైవర్ అందుబాటులో లేకపోవడం ఏదైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.

ఆరు చోట్ల కత్తిపోట్లు
ముంబైలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్న బాంద్రాలోని సైఫ్ నివాసంలో దోపిడికి వచ్చిన అగంతకుడు ఘాతుకాన్ని సృష్టించాడు. సైఫ్‌పై దాడి చేసి ఆరుసార్లు కత్తితో పొడిచాడు. దాంతో ఆదిపురుష్ విలన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దాంతో ఆయనను లీలావతి హాస్పిటల్‌కు తరలించి సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాలకు ముప్పు లేదని వైద్యులు నిర్ధారించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X