వందల కోట్లు సంపాదించినా.. పాత ఫ్లాట్‌లోనే సల్మాన్ ఎందుకు ఉంటారో తెలుసా?
ఏ సినీ నటుడైనా స్టార్‌గా మారి భారీ రెమ్యునరేషన్ తీసుకొంటే వెంటనే విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసి సొంతింటి కలను సాకారం చేసుకోవడం జరుగుతుంది. కానీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మాత్రం అందుకు అతీతంగా కనిపిస్తారు. సల్మాన్ ఎన్నో ఏళ్లుగా ముంబైలోని బాంద్రాలో గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో తన ఫ్యామిలీతో కలిసి ఉంటారు. అయితే ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొనే హీరోల్లో సల్మాన్ ఖాన్ అయినప్పటికీ.. పాత ఫ్లాట్‌లో ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అదే విషయాన్ని అడిగితే..
విలాసవంతమైన బంగ్లాలో కాకుండా బాంద్రాలోని నా ఫ్లాట్‌లో ఉండటానికి అమితంగా ఇష్టపడుతాను. నేను ఉండే ఫ్లాట్‌పైన నా తల్లిదండ్రులు ఉంటారు. నాకు చిన్నప్పటి నుంచి ఈ ఫ్లాట్‌లో ఉండటం అలవాటు అయిపోయింది. నా తల్లిదండ్రులు ఉంటే
ఇంటికి వెళ్లిరావడం నాకు రోజు ఓ పనిగా ఫెట్టుకొంటాను అని సల్మాన్ అన్నారు.

గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లో నా బాల్యానికి సంబంధించిన మధురానుభూతులు ఉన్నాయి. చిన్నప్పుడు నాతో కలిసి చాలా మంది పిల్లలు ఆడుకొనే వాళ్లు. అప్పుటి నుంచి అందరి ఫ్లాట్స్ మా ఫ్లాట్ గానే భావించే వాళ్లం. అందరి ఇంట్లోకి వెళ్లి తినేవాళ్లం. ఇలాంటి ఎన్నో అనుభూతులు, మెమొరీస్ నా వెంట ఉన్నాయి. అందుకే ఫ్లాట్ పాతదైనప్పటికీ.. దాంట్లో ఉంటాను అని సల్మాన్ చెప్పారు.
ఇక సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ప్రముఖ సినీ రచయిత అనే విషయం తెలిసిందే. షోలే లాంటి సినిమాలకు మాటలు, కథ అందించిన ఘనత ఆయనకు ఉంది. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం గెలాక్సీ ఫ్లాట్‌లోనే ఉన్నారు. అందుకే ఆయనకు కూడా ఆ ఫ్లాట్‌తో మంచి అనుబంధం, మధురానుభూతులు ఉన్నాయని చెప్పుకొంటారు.


Click it and Unblock the Notifications











