కోట్లలో రెమ్యునరేషన్ .. వందల కోట్ల సంపద, అద్దె ఇంట్లోనే ఈ స్థార్లు .. ఎవరంటే?
భారతదేశంలో సినిమా ఒక మతమైతే, సినీ తారలు దేవుళ్లతో సమానం . వారి కోసం ప్రాణాలిచ్చే అభిమానులు అడుగడుగునా ఉన్నారు. ఇక సినిమాలు, బ్రాండ్ అండార్స్‌మెంట్స్ ద్వారా కోట్ల రూపాయల రెమ్యునరేషన్.. అనేక వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టి దేశంలోని ధనవంతుల లిస్ట్‌లోనూ స్థానం సంపాదించిన నటులు ఇండియాలో ఎందరో. అలాంటిది కొందరు స్టార్స్ మాత్రం అద్దె ఇళ్లలో నివసిస్తున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..
అద్దె ఇళ్లలో నివసిస్తున్న వారిలో బాలీవుడ్ తారల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో అనేక అద్దె లావాదేవీలు వార్తల్లో నిలిచాయి. వీటిలో చాలా మంది 3 నెలల నుంచి 12 నెలల వరకు అద్దె ఇంటి కోసం అగ్రిమెంట్లు చేసుకున్నట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. గతేడాది అక్టోబర్ 2024లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ ముంబైలోని అత్యంత ఖరీదైన జుహు ఏరియాలో దాదాపు 3,900 చదరపు అడుగులకు పైగా విస్తీర్ణంలో ఉన్న అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకున్నారు. మీడియాలో వస్తున్న కథనాలను బట్టి 12 నెలల అద్దెకు గాను శ్రద్ధా కపూర్ దాదాపు రూ.72 లక్షలు చెల్లించారట.

ఇక మరో నటి.. ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ ఊర్వశి రౌతేలా ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో 3600 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను జనవరి 2025 నుంచి మార్చి 2025 వరకు మూడు నెలల కాలానికి అద్దెకు తీసుకున్నారు. అలాగే గతేడాది డిసెంబర్‌లోనూ మరో స్వల్పకాలిక అద్దె ఒప్పందాన్ని కూడా ఊర్వశి రౌతేలా కుదుర్చుకున్నారట. అయితే ఈ ఒప్పందాల విలువ ఎంతన్నది బయటికి తెలియరాలేదు.

బాలీవుడ్ నటీనటులకు వందల కోట్ల ఆస్తులన్నా ఇలా అద్దె ఇళ్లను తీసుకోవడానికి కారణాలపై నిపుణులు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ముంబైలోని హౌసింగ్ సొసైటీలు, రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు బాలీవుడ్ స్టార్స్‌కు ఇళ్లను విక్రయించేందుకు వెంటనే అంగీకారం తెలపడం లేదని పలువురు రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో నటీనటులు తమ సొంత అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసే వరకు స్వల్పకాలికంగా అద్దె ఇంట్లో నివసిస్తున్నారట.
అంతేకాదు.. ఓ వ్యక్తి అద్దె ఇంట్లో నివసిస్తున్నంతకాలం ఇంటి అద్దె భత్యంను ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో చూపించవచ్చని నిపుణులు అంటున్నారు. అది స్వల్పకాలిక లేదా దీర్ఘకాలిక అద్దె అయినా పర్లేదని.. పన్ను ప్రయోజనం పొందడానికి ఒప్పందం ముఖ్యమని చెబుతున్నారు. ముంబై మహానగరంలో గతేడాది నుంచి స్వల్పకాలిక అద్దె ఇళ్లకు డిమాండ్ 14 నుంచి 15 శాతం పైగా పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి. ఎందుకంటే స్వల్పకాలిక లీజులను అందించే లగ్జరీ సర్వీస్డ్ అపార్ట్‌మెంట్లు తక్కువగా ఉండటమే దీనికి కారణమట. అయితే తక్కువ కాలానికి తీసుకునే అద్దె ఇళ్లు .. సాధారణ , దీర్ఘకాలిక అద్దె ఇళ్లకంటే 10 నుంచి 15 శాతం ఖరీదైనవట. సో.. బాలీవుడ్ నటులు అద్దె ఇళ్లలో ఉండటానికి కారణం అదన్నమాట.


Click it and Unblock the Notifications











