బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ మెడకు డ్రగ్స్ కేసు గట్టిగా చుట్టుకొనే అవకాశం కనిపిస్తున్నది. కొద్ది రోజుల క్రితం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు జారీ చేసిన సమన్ల నేపథ్యంలో సోమవారం విచారణకు హాజరయ్యారు. గతంలో అంటే నవంబర్ 13వ తేదీనఅర్జున్ రాంపాల్ ఇంటిపై మెరుపు దాడులు చేసి ఎలక్ట్రానిక్ వస్తువులను, కొన్ని ట్యాబ్‌లెట్లను స్వాధీనం చేసుకొన్నారు. సుమారు ఏడు గంటలపాటు విచారించిన సంగతి తెలిసిందే.
అయితే అర్జున్ రాంపాల్ నుంచి మెడిసిన్స్, టాబ్లెట్లు స్వాధీనం చేసుకొన్న సమయంలో వైద్యులు సలహా మేరకు, వారు రాసిన ప్రిస్కిప్షన్ ఆధారంగానే ఉపయోగిస్తున్నానని చెప్పిన విషయాలు ఫేక్ అనే తెలియడంతో దానిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. తన స్నేహితుడైన ఓ డాక్టర్ రాసి ఇచ్చిన ప్రిస్కిప్షన్ తప్పుగా సమర్పించారని తెలుస్తున్నది. ఒకవేళ ప్రిస్కిప్షన్ కనుక ఫేక్ అని తేలినట్టయితే అర్జున్ రాంపాల్‌ను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇదిలా ఉండగా, అర్జున్ రాంపాల్ ప్రేయసి.. దక్షిణాఫ్రికాకు చెందిన గ్యాబ్రిల్లా డెమెట్రియాడెస్‌ను, ఆమె సోదరుడు ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌ను విచారించారు. విచారణ అనంతరం ఏజిసియాలోస్ డెమిట్రియాడెస్‌ను అరెస్ట్ చేయడం సంచలనం రేపింది.
అర్జున్ రాంపాల్ డ్రగ్ కేసులో విచారణకు హాజరుకానున్న సమయంలో తన స్నేహితుడు పాల్ బార్టెల్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ముంబైలో నివాసం ఉంటున్న పాల్ ఇంటిలో భారీగా డ్రగ్స్ లభించడంతోపాటు కొన్ని లింకులు కూడా అధికారుల దృష్టికి రావడంతో అధికారులు అదుపులోకి తీసుకొన్ని ప్రశ్నించడం సంచలనం రేపింది.
Arjun Rampal could be arrested in Drug Rocket case. Bollywood actor Arjun Rampal's partner Gabriella Demetriades' brother Agisilaos Demetriades arrested in drugs case. As part of the Sushant Singh Rajput case, NCB searched the Agisilaos Demetriades home and found alprazolam tablets and hashish. Apart from this, Bollywood Actor Arjun Rampal friend Paul Bartel arrested on friday in mumbai.
Story first published: Monday, December 21, 2020, 18:13 [IST]