ప్రభాస్‌కు దీపిక పదుకోన్ కష్టాలు.. ఆ చిక్కుల్లో బ్యూటీ... ముంచుకొస్తున్న అక్టోబర్ గండం!

వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం అందరిలో ఆసక్తిని రేపుతున్నది. చరిత్రలో పురాతన సంఘటనల ఆధారంగా తెరకెక్కి ఈ చిత్రం గురించి ప్రకటన రాగానే దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ చిత్రం ద్వారా దీపిక పదుకోన్ తెలుగు పరిశ్రమలో అడుగు పెడుతున్నారనే విషయం మరింత ఆసక్తితో వివాదంగా మారింది. ఆ విషయంలో వెళితే..

హాట్ హాట్‌గా నిధి అగర్వాల్ క్లీవేజ్ షో.. పొట్టి దుస్తుల్లో గ్లామర్ షో!

 ప్రభాస్‌తో జతకట్టనున్న దీపిక పదుకోన్

ప్రభాస్‌తో జతకట్టనున్న దీపిక పదుకోన్

ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చే ప్రాజెక్టులో దీపిక పదుకోన్ నటిస్తున్నారనే విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ నుంచి వ్యతిరేకత వచ్చింది. ఆమెకు వ్యతిరేకంగా ఓ హ్యాష్ ట్యాగ్ కూడా ట్రెండ్ అయింది. దీపిక వల్ల ప్రాజెక్టు ఎలాంటి ప్రయోజనం లేదనే విషయాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రస్తావించారు.

సోషల్ మీడియాలో దీపికపై వ్యతిరేకత

సోషల్ మీడియాలో దీపికపై వ్యతిరేకత

ఆ తర్వాత కొద్ది రోజులకు నిర్మాతకు రిక్వెస్టుకు దీపిక పదుకోన్ స్పందించడం లేదనే విషయం బయటకు వచ్చింది. అయితే అవి రూమర్లా లేక నిజమా అనే విషయంపై క్లారిటీ రాలేకపోయింది. అయితే రానున్న రోజుల్లో ప్రాజెక్టుకు చిక్కుల తప్పవనే అభిప్రాయం సినీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నది.

కోవిడ్ పరిస్థితులతో డేట్స్ సమస్యలు

కోవిడ్ పరిస్థితులతో డేట్స్ సమస్యలు

కరోనావైరస్ పరిస్థితుల కారణంగా దేశవ్యాప్తంగా సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. దాంతో సినీ తారల డేట్స్ అస్తవ్యవ్తంగా మారాయి. దీపిక పదుకోన్‌కు కూడా అలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనే విషయాన్ని బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి. నాగ్ అశ్విన్ సినిమాకు డేట్స్ సమస్య ఎదురయ్యే అవకాశం ఉందనే విషయాన్ని పేర్కొంటున్నారు.

హృతిక్, అమితాబ్ బచ్చన్‌తో

హృతిక్, అమితాబ్ బచ్చన్‌తో


దీపిక పదుకోన్ విషయానికి వస్తే.. హృతిక్ రోషన్‌తో ఓ చిత్రంలోను, అలాగే హాలీవుడ్‌లో విజయవంతమైన ఇంటెర్న్ రీమేక్ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటిస్తున్నారు. అంతేకాకుండా ద్రౌపది అనే చిత్రాన్ని చేస్తున్నారు. అయితే ఈ సినిమాల షూటింగులు కరోనావైరస్ కారణంగా వాయిదా పడ్డాయి.

Recommended Video

Prabhas ప్యాన్ ఇండియా స్టార్ నుండి Universal Star గా మారుతాడు | #PrabhasNagshwin || Filmibeat Telugu
అక్టోబర్‌లో అలాంటి సమస్యలు

అక్టోబర్‌లో అలాంటి సమస్యలు

దీపిక నటించే చిత్రాలన్నీ అక్టోబర్‌లో మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రభాస్ నటించే నాగ్ అశ్విన్ చిత్రం కూడా అక్టోబర్‌లోనే ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో దీపిక ఎలా తన డేట్స్‌ను సర్దుబాటు చేస్తుందనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది. ప్రస్తుతం కాల్షిట్ల ఖాళీ లేని పరిస్థితుల్లో ప్రభాస్ మూవీ యూనిట్ ఏం చేస్తుందనేదో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X