twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చనిపోయినా పర్వాలేదు, పాకిస్థాన్‌కు 100 బాంబులతో.. మోడీ గురించి శృంగార తార కామెంట్స్!

    |

    పుల్వామా ఘటన జరిగిన 12 రోజుల్లోనే ఇండియా జైషే మహమ్మద్ ని చావుదెబ్బ కొట్టి అమర జవానులకు ఘనమైన నివాళి అర్పించింది. భారత వైమానిక దళాలు మెరుపులు దాడులు జరిపి కేవలం 20 నిమిషాల్లోనే జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలని నేలమట్టం చేశారు. ఈ ప్రక్రియలో 300 మంది ఉగ్రవాదులు నాశనమయ్యారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సత్తా చాటింది. 1000 కేజీల బాంబుని మిరాజ్ యుద్ధవిమానం సాయంతో నేరుగా పాకిస్థాన్ కు వెళ్లి విసరడం విశేషం. సర్జికల్ స్ట్రైక్ 2పై సెలెబ్రిటీలంతా ప్రశంసలు కురిపించారు. తాజాగా శృంగారతార రాఖీ సావంత్ మోడీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

     వివాదాలు

    వివాదాలు

    రాఖీ సావంత్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది వివాదాలే. గ్లామర్ రోల్స్, హాట్ ఎక్స్ ఫోజింగ్ తో శృంగారతార అనే ముద్ర వేయించుకుంది. తరచుగా ఏదో ఒక విషయంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలవడం రాఖి సావంత్ కు అలవాటు. ఎలాంటి విషయం గురించి అయినా మొహమాటం లేకుండా మీడియా ముందు మాట్లేడేస్తుంది. ప్రస్తుతం ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్న సమయంలో మోడీని ప్రశంసిస్తూ రాఖి సావంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

    మోడీ సరైన సమాధానం ఇచ్చారు

    మోడీ సరైన సమాధానం ఇచ్చారు

    నేను దేశానికే మొదటి ప్రాధాన్యత నిస్తా. సర్జికల్ స్ట్రైక్ జరిపి పాకిస్థాన్ కు మోడీ సరైన సమాధానం ఇచ్చారు. ఈ సమయంలో ప్రభుత్వ నిర్ణయాలకు అందరూ అండగా నిలవాలి. ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చక్కగా పని పూర్తి చేయరు అని రాఖీ ప్రశంసించింది. పుల్వామా ఘటన, సర్జికల్ స్ట్రైక్ 2 తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    100 బాంబులతో

    100 బాంబులతో

    ఒక వేళ అవసరమైతే తాను కూడా 100 బాంబులు తీసుకుని పాకిస్థాన్ కు వెళ్లి ఉగ్రవాదులని మట్టుబెడతాన్ని రాఖి సావంత్ తెలిపింది. ఈ క్రమంలో నా ప్రాణాలు కోల్పోయినా పర్వాలేదు అంటూ తన దేశభక్తిని ప్రదర్శించింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియన్ ఆర్మీకి అండగా నిలిచేందుకు తాను సిద్ధం అని రాఖీ తెలిపింది. అవసరమైతే తాను కూడా ఆర్మీతో కలసి పాకిస్థాన్ వెళతానని తెలిపింది.

    అభినందన్ క్షేమంగా రావాలని

    అభినందన్ క్షేమంగా రావాలని

    ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ అభినందన్ క్షేమంగా తిరిగిరావాలని తాను దేవుడికి ప్రార్థించినట్లు రాఖి సావంత్ మీడియాతో పేర్కొంది. లుథియానాలో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన సందర్భంగా రాఖీ సావంత్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఇదిలా ఉండగా శుక్రవారం రోజు అభినందన్ ని విడుదల చేయనున్నట్లు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

    English summary
    Will go to rival territory with 50-100 bombs and destroy them: Rakhi Sawant says
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X