‘పీఎం నరేంద్రమోదీ’పై బ్యాన్?... మాకు హక్కులేదు.. ఆసక్తికరంగా వివాదం

ప్రధాని నరేంద్రమోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన పీఎం నరేంద్రమోదీ మూవీని వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఈ చిత్ర రిలీజ్‌పై స్టే విధించాలని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల సమయంలో ఓటర్లపై ప్రభావం పడుతుందనే కారణాన్ని చూపుతూ పలువురు ఈ సినిమాపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు ఈ చిత్రంపై నిషేధం విధిస్తుందా అనే విషయం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే...

పీఎం నరేంద్రమోదీపై పిల్

పీఎం నరేంద్రమోదీపై పిల్

పీఎం నరేంద్రమోదీ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలంటూ పిటిషన్ దాఖలు చేసిన తౌసీఫ్ షేక్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమాపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాన్ని దాఖలు చేశాం. కేంద్ర సమాచార వాఖ, సెన్సార్ బోర్డు, ఎన్నికల కమీషన్‌, నిర్మాతలను, నటీనటులను మొత్తం 10 మందిని ఈ కేసులో బాధ్యులిగా చేశాం అని అన్నారు.

మాకు హక్కులేదు: ఈసీ

మాకు హక్కులేదు: ఈసీ

పీఎం నరేంద్రమోదీ సినిమా రిలీజ్‌ను వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎన్నికల స్పందిస్తూ.. ఈ బయోపిక్ రిలీజ్‌ను తాము వాయిదా వేసే హక్కు లేదు. సెన్సార్ బోర్డు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. త్వరలోనే వారు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు అని ఈసీ అధికారులు వెల్లడించారు.

 ఆయనను హీరోగా చూపించే.

ఆయనను హీరోగా చూపించే.

పీఎం నరేంద్రమోదీ సినిమాపై వస్తున్న ఆరోపణలపై హీరో వివేక్ ఒబేరాయ్ స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో రిలీజ్ కావడం యాదృచ్చికం మాత్రమే. ఇది ప్రచారపరమైన చిత్రం కాదు. సినిమా ద్వారా మోదీని హీరోగా చిత్రీకరించనవసరం లేదు. ఎందుకంటే ఆయన కోట్లాది మంది హృదయాల్లో హీరోగా మారారు అని అన్నారు.

సెన్సార్ బోర్డు నిర్ణయంపై దృష్టి

సెన్సార్ బోర్డు నిర్ణయంపై దృష్టి

పీఎం మోదీ బయోపిక్ రిలీజ్ డేట్ సమీపించిన నేపథ్యంలో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయం అత్యంత ఆసక్తిగా మారింది. ఒకవేళ రిలీజ్ ఆపివేస్తే రాజకీయ వర్గాల నుంచి వచ్చే స్పందన ఏమిటనేది చర్చనీయాంశమైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X