5000 కోట్ల కుంభకోణంలో రష్మిక మందన్న?, స్టార్ హీరోయిన్స్, హీరోలను విచారించేందుకు ఈడీ సిద్దం!

హిందీ సినీ పరిశ్రమను బెట్టింగ్ యాప్ కుంభకోణం వెంటాడుతున్నది. ఈ కుంభకోణంలో బాలీవుడ్‌కు చెందిన హిందీ అగ్ర హీరోల పేర్లు బయటకు రావడంతో సంచలనంగా మారింది. మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో మనీలాండరింగ్ జరిగిందనే ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టోరేట్ (ఈడీ)రంగంలోకి దిగి పలు సినీ తారలకు నోటీసుల పంపడంతో అత్యంత వివాదాస్పదంగా మారింది. ఈ వివాదాస్పద అంశానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

దుబాయ్‌లో మహాదేవ్ యాప్ ప్రమోటర్ సౌరబ్ చంద్రశేఖర్ ఇంట్లో జరిగిన వివాహ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులందరూ హాజరయ్యారు. ఈ వివాహానికి దాదాపు 260 కోట్ల రూపాయాలు ఖర్చు చేశారు. అయితే ఈ వివాహానికి హాజరైన ప్రముఖులందరికీ భారీ ఎత్తున్న డబ్బు వారి అకౌంట్‌లోకి వెళ్లాయనే ఆరోపణలు వచ్చాయి.

Mahadev betting App

మహదేవ్ యాప్ ప్రమోటర్ సౌరభ్ చంద్రశేఖర్ ఇంట్లో జరిగిన వివాహానికి సునీల్ శెట్టి, సంజయ్ దత్, సోను సూద్, సోనాక్షి సిన్హా, రష్మిక మందన్న, సారా ఆలీఖాన్, టైగర్ ష్రాఫ్, కపిల్ శర్మ, మలైకా అరోరా, మౌనీ రాయ్, ఊర్వశీ రౌటేలా, స్నేహా ఉల్లాల్, నర్గీస్ ఫక్రీ, అఫ్తాబ్ శివదాసాని, ప్రీతి జింగ్యానీ‌తోపాటు మొత్తం 34 మందికి ఈ కుంభకోణంలో ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో సినీ ప్రముఖులను విచారించేందుకు ఈడీ రంగంలోకి దిగింది. రణ్‌బీర్ కపూర్, హీనా ఖాన్, హ్యుమా ఖురేషి, కపిల్ శర్మకు సమన్లు జారీ చేశారు. 34 మందిలో ఇంకా పలువురిని విచారించేందుకు ఈడీ అధికారులు సిద్దమవుతున్నారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందనే రుజువులు దొరికితే.. సినీ ప్రముఖులకు కష్టకాలం దాపురించే అవకాశాలు ఉన్నాయి.

Will Rashmika Mandanna get clean Chit from 5000 crores Mahadev betting App?

మహాదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో సమన్లు అందుకొన్న రణ్‌బీర్ కపూర్, కపిల్ శర్మ, హీనా ఖాన్ తదితరులు బిజీ షెడ్యూల్ కారణంగా రెండు వారాల గడువు ఈడీని అడిగారు. అయితే ఇంకా కొందరికి నోటీసులు కూడా అందుతాయనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అత్యంత భారీగా జరిగిన వివాహంలో దాదాపు 5000 కోట్ల మేర కుంభకోణం జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. అలాగే దాదాపు 500 కోట్లకుపైగా రూపాయలు మేర బాలీవుడ్ ప్రముఖులకు ముడుపులు ముట్టాయనే విషయం చర్చనీయాంశమైంది. ఈ పెళ్లిలో వివాహం కోసం 200 కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో ఖర్చు పెట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X