twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రియా చక్రవర్తి అరెస్ట్‌కు అడుగులు.. సుశాంత్‌ కేసులో సీబీఐ ముందు సవాళ్లు ఇవే

    |

    బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు కొత్త మలుపు తిరుగుతున్నది. తన కుమారుడు మరణం వెనుక అనేక అనుమానాలున్నాయనే ఆరోపణలపై సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో కేసు దాఖలు చేయడం, ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో ఈ కేసులో సంచనల విషయాలు చోటుచేసుకొన్నాయి. తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో సీబీఐ ఈ కేసు దర్యాప్తు కోసం రంగంలోకి దిగింది. అయితే ఇప్పుడు రియా చక్రవర్తిని అరెస్ట్ చేస్తారనే విషయం చర్చనీయాంశం కావడంతో సీబీఐ ముందు ఉన్న సవాళ్ల గురించి చర్చ జరుగుతున్నది. ఆ సవాళ్లు ఏమిటంటే..

    సుశాంత్ తండ్రి ఆరోపణలపై

    సుశాంత్ తండ్రి ఆరోపణలపై

    సుశాంత్ సింగ్‌ను మరణానికి ప్రేరేపించేలా రియా చక్రవర్తి వ్యవహరించిందనే ఆరోపణలతో కేకే సింగ్ కేసు నమోదు చేశారు. తన కుమారుడు బ్యాంక్ అకౌంట్లలో అనేక అవకతవకలు జరిగాయని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఈడీ, సీబీఐలు రంగంలోకి దిగి దర్యాప్తు మొదలుపెట్టాయి.

    రియా చక్రవర్తికి చుక్కెదురు

    రియా చక్రవర్తికి చుక్కెదురు

    పాట్నా నుంచి కేసును ముంబైకి బదిలీ చేయాలనే కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. సుశాంత్ కేసును దర్యాప్తు చేయడానికి బీహార్ పోలీసులకు హక్కు లేదు. సుశాంత్ మరణ ఘటన వారి పరిధిలో జరుగలేదనే విషయాన్ని రియా తన పిటిషన్‌ పేర్కొన్నారు. అయితే రియా పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.

    ముంబైకి చేరుకొన్న సీబీఐ బృందం

    ముంబైకి చేరుకొన్న సీబీఐ బృందం


    సుప్రీంకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు బృందం ముంబైలో అడుగుపెట్టింది. సీబీఐకి చెందిన అవినీతి నిరోధక బృందానికి చెందిన నాలుగో విభాగం ఈ కేసును దర్యాప్తు చేయనున్నది. ఈ బృందంలో సీబీఐ జాయింట్ డైరెక్టర్ మనోజ్ శశిధర్, డీఐజీ గగన్ దీప్ గంభీర్, అడిషినల్ ఎస్పీ అనిల్ యాదవ్, ఎస్పీ నూపూర్ ప్రసాద్ ఉన్నారు.

    సీబీఐ ముందు సవాళ్లు ఇవే..

    సీబీఐ ముందు సవాళ్లు ఇవే..

    సుశాంత్ మరణానికి రియా కారణమంటూ తండ్రి చేసిన ఆరోపణలను సీబీఐ దర్యాప్తులో నిరూపణ కావాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలు నిరూపించడం కష్టమే అనే వాదన నిపుణుల నుంచి వినిపిస్తున్నది. అలాగే సుశాంత్‌ను నిర్బంధానికి గురిచేసి మరణించేలా చేసిందనే మరో ఆరోపణ. సుశాంత్‌ కెరీర్‌ను తొక్కివేయడానికి రియా కుట్రపన్నారు, వ్యక్తిగతంగా, ఆర్థిక విషయాల్లో బెదిరిస్తూ కుట్రలు పన్నారనే విషయాలు సీబీఐకి సవాళ్లుగా మారనున్నాయి.

    Recommended Video

    Dil Bechara Review | Sushant Singh Rajput | Sanjana Sanghi | AR Rahman
    రియా చీటింగ్ నిరూపణ జరిగితే..

    రియా చీటింగ్ నిరూపణ జరిగితే..

    సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను ఆర్థికంగా, వ్యక్తిగతంగా చీటింగ్ చేసిందనే నిరూపిస్తే రియా అరెస్ట్ కావడం తథ్యం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సుశాంత్ ఇంటి నుంచి కొన్ని విలువైన వస్తువులను దొంగిలించిందనే ఆరోపణ ఉంది. ఇలాంటి ఆరోపణల్లో ఏ ఒక్క దానిని సీబీఐ నిరూపించ గలిగితే రియా అరెస్ట్ తప్పనిసరిగా మారుతుందనే వాదనను న్యాయ నిపుణులు, పోలీసులు వర్గాలు పేర్కొంటున్నాయి.

    English summary
    Supreme Court verdict has reveal that CBI will investgate the Sushant Singh Rajput case. SC has pronounced the verdict that CBI will investigate the Sushant Singh Rajput case furthur. CBI Joint director Manoj Shashidhar to lead the three member of CBI team. In this juncture, there are some Challenges to arrest of Rhea Chakraborty for CBI.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X