ప్రియురాలి కోసం అలాంటి పని.. అంతా సైలెంట్‌గా పూర్తి చేస్తున్న స్టార్ హీరో!
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అభిమానులకు ఎప్పటికి ప్రత్యేకం. ఒక స్టార్ గానే కాకుండా వ్యక్తిగత విషయాలతో కూడా సల్మాన్ ఖాన్ నిత్యం వార్తల్లో ఉంటాడు. సినిమాలతో సల్మాన్ అభిమానులకు వినోదాన్ని పంచుతుంటే, అతడి వ్యక్తిగత విషయాలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలు కేసులతో సల్మాన్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఐదు పదుల వయసులో కూడా సల్మాన్ ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులరే. అంత మాత్రానా సల్మాన్ రొమాంటిక్ వ్యవహారాలకు కొదవ లేదు. ప్రస్తుతం సల్లు భాయ్ రొమేనియా బ్యూటీ ఇలూయా వంతూర్ తో సహజీవనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ఎన్నో ప్రేమ కథలు
సల్మాక్ సినీ కెరీర్ ఆరంభం అయినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రేమ కథలు వినిపిస్తూ వచ్చాయి. సల్మాన్ ఖాన్ ప్రేమ వలకు స్టార్ హీరోయిన్లంతా ఫిదా అయ్యారు. సల్మాన్ జీవితంలో ప్రేమించడం ఎంత సాధారణంగా జరిగిందో విడిపోవడం కూడా అంతే సాధారణంగా జరిగింది.

రొమేనియా బ్యూటీ
సల్మాన్ ఖాన్ వివాహం చేసుకుంటాడో లేదో తెలియదు కానీ తాజాగా మరో ప్రేమ కథ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా సల్లు భాయ్ రొమేనియా బ్యూటీ ఇలూయా వంతూర్ తో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

ప్రియురాలి కోసం
తాజాగా సల్మాన్ ఖాన్ ప్రియురాలి కోసం తన స్థాయిని కూడా పక్కన పెట్టి ఓ పని చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలూయా వంతూర్ ప్రస్తుతం ఓ చిత్రంలో నటిస్తోంది. ప్రేమ్ సోని దర్శకత్వంలో రాధా క్యూన్ గోరి మైన్ క్యూన్ కాల చిత్రంలో ఇలూయా నటిస్తోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రోత్సహించింది అతడే
ఈ చిత్రంలో తనకు నటించడానికి కారణం సల్మాన్ ఖాన్ అని ఇలూయా పోస్టర్ లాంచ్ కార్యక్రమంలో తెలిపింది. కథలు ఎంపిక విషయంలో సల్మాన్ ఖాన్ కు మంచి పట్టు ఉంది. సల్మాన్ ఖాన్ ప్రోత్సాహం ఈ చిత్రానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఇలూయా తెలిపింది.


Click it and Unblock the Notifications











